Begin typing your search above and press return to search.

ఉత్త‌రాంధ్ర నేత‌ల ఆవేద‌న‌.. గ్రాఫ్ త‌గ్గిపోతోంద‌ట‌!

By:  Tupaki Desk   |   16 Sep 2022 3:30 PM GMT
ఉత్త‌రాంధ్ర నేత‌ల ఆవేద‌న‌.. గ్రాఫ్ త‌గ్గిపోతోంద‌ట‌!
X
వైసీపీ ఉత్త‌రాంధ్ర నేతలు.. ల‌బోదిబోమంటున్నారు అంట, ఎక్క‌డా ఎవ‌రూ కూడా హ్యాపీగా లేమ‌ని చెబుతున్నారు అని తెలుస్తుంది . అంతేకాదు.. అంద‌రూ కూడా.. పార్టీ గ్రాఫ్ త‌గ్గిపోతోంద‌ని ల‌బోదిబోమంటున్నారు అని చెబుతున్నారు . దీనికి కార‌ణం.. ఏంటి? నిజానికి ఉత్త‌రాంధ్రలో రాజ‌ధాని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. ఇక్క‌డ గ్రాఫ్ పెరుగుతుంద‌ని.. వైసీపీ నేత‌లు లెక్క‌లు వేసుకున్నారు. అయితే.. దీనికి రివ‌ర్స్‌లో వ్య‌వ‌హారం న‌డుస్తోంది. ఎక్కడిక‌క్క‌డ ప్ర‌జ‌లు వైసీపీ నేత‌ల‌ను వ్య‌తిరేకిస్తున్నారు. 'అభివృద్ధి ఏదీ?' అంటూ.. వారు ప్ర‌శ్నిస్తున్నారు.

దీంతో వైసీపీ నాయ‌కులు త‌ల్ల‌డిల్లుతున్నారు. ఇదే విష‌యాన్ని.. వైసీపీ కీల‌క నాయ‌కుడు.. వ‌ద్ద నాయ‌కులు వాపోయారు అని తెలుస్తుంది . "స‌ర్ ఇక్క‌డ ప‌రిస్థితి బాగోలేదు. ప్ర‌జ‌లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. అప్ప‌టి వ‌ర‌కు ల‌బ్ధిదారులుగా ఉన్న‌వారికి.. మ‌నం ప‌థ‌కాలు ఎత్తేశాం. అర్హులైన వారికి కూడా ప‌థ‌కాలు ఇవ్వ‌క‌పోతే.. మన గ్రాఫ్ ఎలా పెరుగుతుంది?" అని చెప్పుకొచ్చారు. మ‌రికొంద‌రు నాయ‌కులులు.. అభివృద్ధిపై ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్లో నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో మండ‌ల‌స్థాయి నాయ‌కులు... ప్ర‌ధానంగా హాజ‌ర య్యారు. ఈ స‌మ‌యంలోనే వారు ప్ర‌జ‌ల నాడికి సంబంధించిన అనేక విష‌యాల‌ను ఆ వైసీపీ పెద్ద ముందు పెట్టారు అని చెబుతున్నారు . వారంతా చెప్పింది ఏంటంటే.. పార్టీ పైపైన మెరుగులు చూసి..

లెక్క‌లు వేసుకుంటోంద‌ని.. కానీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం ప‌రిస్థితి అలా లేద‌ని.. కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ట‌. అంతేకాదు.. ర‌హ‌దారులు.. ప‌రిశ్ర‌మ‌లు.. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ విష‌యంలో స‌ర్కారు అనుస‌రిస్తున్న విధానం వంటివి ప్ర‌జ‌ల్లో విప‌రీతంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయ‌ని వివ‌రించార‌ట‌.

"మేం బ‌లంగానే ఉన్నాం. ఎన్నిక‌లు వ‌స్తే.. పోటీకి సిద్ధంగానే ఉన్నాం. కానీ..ప్ర‌జ‌ల మ‌న‌వైపు.. లేరు సార్‌. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. వారు పెట్టుకున్న ఆశ‌లు ఎక్క‌డా ఫ‌లించ‌లేద‌ని.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌లో స్ప‌ష్టంగా చెబుతున్నారు. అందుకే.. ఇబ్బందులు వ‌స్తున్నాయి.

ఇప్ప‌టికైనా..ప్ర‌భుత్వం అభివృద్ది దిశ‌గా అడుగులు వేయాలి." అని కొంద‌రు నాయ‌కులు సూచించార‌ట‌. దీనికి ఆ పెద్దాయన మౌనంగా ఉండి.. అదిష్టానంతో చ‌ర్చించి.. ఒక నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది. మొత్తానికి ఉత్త‌రాంధ్ర‌లో వైసీపీకి సెగ‌లు.. పెరుగుతున్న విష‌యం ఆ పార్టీ నేత‌ల నోటి నుంచేరావ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.