Begin typing your search above and press return to search.
సోముకు చేతినిండా పనే.. జగనా మజాకా..!
By: Tupaki Desk | 27 Aug 2022 1:30 AM GMTవైసీపీ నాయకులు తలుచుకుంటే.. ఇది సాధ్యం.. అది సాధ్యం కాదు.. అనే మాటేముంది.. చేతిలో అధికా రం ఉంది.. చేయగలిగిన చేవా ఉంది. ఎవరో ఏదో అనుకుంటారనే బాధ..ఆవేదన అంతకన్నా లేవు. దీం తో వైసీపీ నాయకులు తమ చిత్తం వచ్చినట్టు.. చిత్తం ప్రభూ.. అనే రేంజ్‌లో దూకుడు చూపిస్తున్నారు. తాజాగా మరో నాలుగు రోజుల్లో.. రాష్ట్రంలోనేకాదు.. దేశంలోనూ వినాయక చవితి సంబరాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఇవి సాదాసీదాగా నిర్వహిస్తే.. ఏం బాగుంటుందని అనుకున్నారో.. ఏమో..!
వైసీపీ నాయకులు దీనికి పార్టీ కలర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ ఆధ్వర్యంలో నిర్వ హించే గణపతి మందిరాల్లో ఏర్పాటు చేసే.. వినాయకుడి ప్రతిమలకు ఇదిగో ఇలా.. పార్టీ రంగులు పూసే శారు. పైనుంచి వచ్చిన ఆదేశమో..
లేక పైవారిని మెప్పించాలనే ప్రయత్నమో తెలియదు కానీ.. మొత్తానికి విగ్రహానికి నిగ్రహంతో కూడిన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ..పార్టీ రంగులు పూసేశారు. కట్ చేస్తే.. ఇది.. రాష్ట్ర బీజేపీ నాయకులకు చేతినిండా పనికల్పించిందనే కామెంట్లు వస్తున్నాయి.
ఇప్పటికే.. ఏదో ఒక కారణాన్ని 'వెతికి' పట్టుకుని రాజకీయంగా పుంజుకోవాలని చూస్తున్న బీజేపీ నాయకు లకు.. వైసీపీ నాయకులు చేతినిండా అందించిన పనిగానే చెప్పుకోవచ్చు. సాధారణంగా.. ఇతర ఆఫీసు లకు రంగులు వేస్తేనే యాగీ చేసిన బీజేపీ నాయకులు.. సాక్షాత్తూ.. హిందూ దేవతల్లో ప్రథముడు.. గణనాయకుడు.. తొలి పూజలు అందుకునేవాడు.. అయిన.. గణపతికి ఇలా .. రంగులు పూస్తే..ఊరుకుంటారా? ఊరూవాడా యాగీ చేయరు.
సో.. చేస్తారు. కాబట్టి.. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు పరివారానికి వైసీపీ నాయకులు చేతినిండా పనిక ల్పించారనే అంటున్నారు పరిశీలకులు. చేసుకున్నవారికి చేసుకున్నంత యాగీ.. అన్నట్టుగా.. వైసీపీ నేతలే ఆయుధాలు ఇస్తే..
బీజేపీ వారు మాత్రం కాదనేది ఏముంటుంది. సో.. ఇక, వైసీపీ గణనాధులు కొలువు తీరుతున్న వేళ బీజేపీ రాజకీయాలు మరింత దూసుకుపోవడం ఖాయం.. ధర్నాలు.. రాస్తారోకోలు.. సవాళ్లు.. ప్రతిసవాళ్లతో ఏపీ అట్టుడికిపోవడం.. మీడియాకు కూడా పనిదొరకడం.. అంతా.. చవితి మహిమ!!