Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీ నెత్తిన పాలుపోస్తున్న బీజేపీ.. ఎలాగంటే!
By: Tupaki Desk | 27 May 2022 3:45 AM GMTవైఎస్సార్సీపీ నెత్తిన బీజేపీ పాలుపోస్తోందా అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ పరిశీలకులు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. జూన్ 23న పోలింగ్ జరగనుంది.
ఈ ఉప ఎన్నికకు టీడీపీ, జనసేన పార్టీలు దూరంగా ఉండాలని దాదాపు ఇప్పటికే నిర్ణయించాయి. బీజేపీ మాత్రం పోటీ చేయడానికి మొగ్గుచూపుతోంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. బీజేపీ ఆత్మకూరులో పోటీ చేస్తే వైఎస్సార్సీపీ నెత్తిన పాలుపోసినట్టేనని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే సహజంగానే ఒక నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి చనిపోతే.
అతడు ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయితే ఆ పార్టీకి, అలాగే ఆ వ్యక్తి కుటుంబానికి సానుభూతి ఉండటం సహజం. అందులోనూ మేకపాటి గౌతమ్ రెడ్డి సహృదయుడిగా, సౌమ్యుడిగా పేరు పొందారు. అధికార పార్టీ తరఫున అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుపొందడం సులువు. ఈ నేపథ్యంలో బీజేపీ అక్కడ పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం అవసరమా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలాగే తిరుపతి ఎంపీగా ఉన్న బల్లి దుర్గాప్రసాదరావు మరణిస్తే జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అలాగే కడప జిల్లా బద్వేలులోనూ అధికార పార్టీ ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికలోనూ బీజేపీ పోటీ చేసింది. ఇక్కడ కూడా ఆ పార్టీ పరాజయం పాలైంది. అటు బద్వేలు, ఇటు తిరుపతిలోనూ వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. ఈ రెండు ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలు టీడీపీ, జనసేన దూరంగా ఉన్నాయి.
బీజేపీ పోటీ చేయడం వల్ల వైఎస్సార్సీపీ తమ గెలుపును గొప్పగా చెప్పుకుందని గుర్తు చేస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు పోటీ చేయకపోయినా బీజేపీకి దొంగచాటుగా మద్దతు ఇచ్చాయని.. తనకలవాటైన రీతిలో ఆరోపణలు చేసిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మూడు పార్టీలు దొంగ పొత్తులతో కలసి వచ్చినా ఆ పార్టీలను చిత్తు చేశామని వైఎస్సార్సీపీ విర్రవీగిందని విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆత్మకూరులో బీజేపీ పోటీ చేయకపోవడమే ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేదంటే ఉన్న పరువు పోవడం ఖాయమంటున్నారు. ఉప ఎన్నిక జరిగితే వైఎస్సార్సీపీ గెలుపొంది తమపై వ్యతిరేతక ఏమాత్రం లేదని చెప్పుకుంటుందని అంటున్నారు. అందుకే భారీ విజయం సాధించామని.. ఈ విజయం వచ్చే ఎన్నికలకు సంకేతమని ఆ పార్టీ చెప్పుకునే వీలుంటుందని పేర్కొంటున్నారు. మరి బీజేపీ.. అధికార పార్టీ వ్యూహాన్ని అర్థం చేసుకోకుండా అడ్డంగా చిక్కుకుపోతోందని చెబుతున్నారు.