Begin typing your search above and press return to search.

హత విధీ ఇదేమి బూతు పురాణం : లోకేష్ పని మనిషికి కడుపు చేసి...?

By:  Tupaki Desk   |   12 Aug 2022 8:02 AM GMT
హత విధీ ఇదేమి బూతు పురాణం :  లోకేష్ పని మనిషికి కడుపు చేసి...?
X
ఏపీలో ఇపుడు రాజకీయాలు విమర్శలు కు విమర్శలు స్థాయి కూడా దాటిపోయాయి. అసభ్యత అన్న దానికి హద్దులు చెరిపేసే వికృత క్రీడ సాగుతోంది. మీ బూతా మా బూతా అన్నట్లుగా బస్తీ మే సవాల్ చేసుకుంటున్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట చెప్పబడుతున్న ఒక న్యూడ్ వీడియో కాదు కానీ ఏపీలో ఇపుడు అధికార వైసీపీ విపక్ష టీడీపీల మధ్య అగ్గి రాజుకుంటోంది.

వివాదాలు స్థాయి దాటి మరింతగా ముదిరిపోతున్నాయి. త్వం శుంట అంటే త్వం శుంఠ అని ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. గోరంట్ల న్యూడ్ వీడియో ఫేక్ అని ఏ క్షణాన అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పారో కానీ దాని మీద తెలుగుదేశం వీర లెవెల్ లో విరుచుకుపడుతోంది. అలా చెప్పడానికి ఆయన ఎవరు అంటూ టీడీపీ యువ నేత లోకేష్ గొంతు పెంచారు. తెలుగు మహిళా ప్రెసిడెంట్ వంగలపూడి అనిత అయితే పోలీసుల మీదనే అభాండాలు వేశారు.

మరి వైసీపీ మహిళలు ఊరుకుంటారా. వారు కూడా మీడియా ముందుకు వచ్చి తమ సత్తా చూపుతున్నారు. ఈ మధ్యలో లోకేష్ బాబు రాసలీలలు అంటూ వైసీపీ నేత నాగార్జున యాదవ్ ట్విట్టర్ లో పెట్టిన ఫోటోలు ఇపుడు వైసీపీ వారికి ఆయుధాలుగా మారాయి. లోకేష్ విదేశీ భామలతో ఉన్నట్లుగా కనిపించే ఆ ఫోటోలను చూపించి చినబాబు రాసలీలల మీద చంద్రబాబు జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

అంతే కాదు చినబాబు లోకేష్ తన ఇంట్లో పని మనిషికి కడుపు చేసి హెరిటేజ్ డబ్బులతో ఆ విషయం బయటకు పొక్కకుండా కేసు మాఫీ చేశారని కూడా వైసీపీ మహిళలు దారుణమైన ఆరోపణలు చేశారు.

గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో నుంచి కధ మొదలై ఇపుడు లోకేష్ బాబు రాసలీలల దాకా కధ నడపడం అంటే రాజకీయాలు ఎటు పోతున్నాయి అని కూడా అంతా ఆశ్చర్యపోతున్న విషయమే ఇక పోలీసుల మీద నోటికిచ్చినట్లుగా మాట్లాడుతున లోకేష్ బాబు ఏమైనా ఐఏస్ చదివాడా, పోలీస్ శిక్షణ తీసుకున్నాడా అంటూ వైసీపీ మహిళలు ఆరోపిస్తున్నారు. మా పార్టీ మీద ఇలాంటి మార్ఫింగ్ వీడియోలను పెడితే మేము చూస్తూ ఊరుకోమని కూడా అంటున్నారు. ఐటీడీపీ పేరిట విదేశాల నుంచి వీడియోలు అప్ లోడ్ అయిన సంగతికి వారు గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో మాధవ్ పరువు పోయిందా లేదా అన్నది ఒక పాయింట్ అయితే ఇపుడు లోకేష్ పరువు కూడా తీస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అయినా కడుపులు రాసలీలలు అంటూ అడ్డంగా మాట్లాడడమేంటి అన్న విమర్శలు అయితే అన్ని వైపులా వస్తున్నాయి.