Begin typing your search above and press return to search.
సమర శంఖారావం...వైసీపీ ఎన్నికల శంఖారావం
By: Tupaki Desk | 5 Feb 2019 12:14 PM GMTఅసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతోంది. ఓ వైపు అధికార పార్టీ తాయిలాలు ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న సమయంలో...ప్రధానప్రతిపక్ష పార్టీ సైతం తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరీ 6వ తేదీ తిరుపతిలో సమర శంఖారావం సభకు సిద్ధమవుతోంది. ఈ సభకు చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల పార్టీ శ్రేణులు పాల్గొంటారు. అనంతరం - వైఎస్సార్ జిల్లా - అనంతపురం జిల్లాల్లో వరసగా మూడు రోజులు సమర శంఖారావం కార్యక్రమాలను వైసీపీ నిర్వహించనుంది.
సమర శంఖారావం ద్వారా వైఎస్ ఆర్ సీపీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయబోతుంది. రాబోయే ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలపునకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలన్నారు. ఇప్పటికే నియోజక - జిల్లా స్థాయిలో బూత్ కమిటీ కన్వీనర్లకు - సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సదస్సు ద్వారా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని లక్షల సంఖ్యల్లో ఓటర్లను తొలగించడం, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం వంటి అంశాల గురించి తెలియజెప్పడంతో పాటుగా - నవరత్నాల గురించి వివరంగా తెలియజెప్పడం - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తీసుకునే నిర్ణయాలను ఈ సందర్భంగా మరోమారు విపులీకరించనున్నట్లు సమాచారం.
దీంతోపాటుగా ఈ మూడు జిల్లాలకు సంబంధించిన కీలకమైన అంశాలను ప్రకటించననున్నట్లు తెలుస్తోంది. కీలకమైన మూడు జిల్లాలకు చెందిన అభ్యర్థులను జగన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టతకు వచ్చిన వైసీపీ అధినేత తాజాగా నిర్వహించే సభలో ఈ మేరకు అభ్యర్థులను ప్రకటించి అధికార పార్టీ కంటే ముందుగా ఎన్నికల పోరులో తమ శ్రేణులను సమాయత్తం చేయనున్నట్లు పేర్కొంటున్నారు.