Begin typing your search above and press return to search.
షర్మిలకు మహిళా లోకం బాసట
By: Tupaki Desk | 16 Jan 2019 4:41 AM GMTమహిళలకు మహిళలే బాసట..... ఏ స్త్రీ కైనా ఇబ్బంది వస్తే - కష్టం కలిగితే తాము అండగా ఉన్నామంటూ మహిళలు భరోస ఇవ్వడం చాల సార్లు జరిగింది. పురుషులలో ఈ ఐక్యత కనిపించడం కష్టమే కాని మహిళలలో మాత్రం ఇది ఎక్కువే. ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తే - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ మోహన రెడ్డి సోదరి షర్మిల విషయంలో రుజువైంది. తనను అవమానించడానికి తన క్యారెక్టర్ ను రోడ్డున పడివేయాడానికి కొందరు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారంపై షర్మిల పోలిసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రభాస్ అనే వ్యక్తితో తనకు సంబంధం ఉందంటూ నాలుగు సంవత్సారాలు క్రితం ప్రారంభించిన ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారని - దీని వెనుక ఎవరున్నారో తెలుసుకుని చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కున్నారు. తాను హైదరబాదులో నివాసం ఉంటున్నానని అందుకే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసేనని పేర్కొన్నారు. అయితే ఎక్కడ ఫిర్యాదు చేయడం - ఎవరి పై చేయడం అనే అంశాలను పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలు మాత్రం షర్మిలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరం ఆ పార్టీలకే పరిమితం కావాలని - అవి వ్యక్తిగతం కాకూడదన్నది తెలుగు మహిళల అభిప్రాయంగా చెబుతున్నారు. ఓ మహిళను అవమాన పరచి రాక్షాసానందం పొందడం దారణమని తెలుగు మహిళలు వ్యాఖ్యనిస్తున్నారు. లేనిపోని నిందలతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలంటున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను వాడుకోవడం అన్యాయమని - ఇది సరైన పద్దతి కాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళలే కాక ఇతర పార్టీలకు చెందిన మహిళా విభాగాల నాయకురాలు కూడా అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇలాంటి ప్రచారాలకు తెరతీస్తే భవిష్యత్తులో మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండా పోతుందని వారంటున్నారు. . రాజకీయ పార్టీలకు చెందని వారే కాకుండా సోషల్ మీడియాను ఫాలో అవుతున్న మహిళలు - సాధరణ మహిళలు కూడా షర్మిలకు అండగా ఉంటామంటు ముందుకు వస్తున్నారు