Begin typing your search above and press return to search.
హస్తంతో దోస్తీ!... వైసీపీ ఛాన్సే లేదందే!
By: Tupaki Desk | 16 May 2019 5:24 PM GMT2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితులు చాలా క్లియర్‌గానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీట్లు సాధించే ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకుని కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇటు బీజేపీతో పాటు అటు కాంగ్రెస్ కూడా ఇప్పటికే ప్రారంభించేశాయి. ఈ తరహా చర్యల్లో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్సే స్పీడుగా వెళుతోంది. ఎందుకంటే... చాలా ప్రాంతీయ పార్టీలు మరోమారు మోదీని ప్రధానిగా అంగీకరించే పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది కదా. ఈ నేపథ్యంలో బీజేపీ కాదంటే... ఆ మేర సీట్లు ఉండే పార్టీ తమదే కదా అన్నది హస్తం పార్టీ నేతల వాదన.
ఈ క్రమంలోనే హస్తం పార్టీ నేతలు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఇప్పటికే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌తోనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలోని టీఆర్ ఎస్ - ఏపీలోని విపక్షం వైసీపీలను కూడా కలుపుకుని పోయే దిశగా కాంగ్రెస్ సన్నాహాలు చేస్తోంది. ఈ సన్నాహాల్లో భాగంగా ఇప్పటికే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చిందని - దానిపై ఆయన ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కొన్ని వర్గాలు - ఆ ప్రతిపాదనను తిరస్కరించారని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు ఆ పార్టీ నుంచే ఈ విషయంలో ఓ స్పష్టమైన ప్రకటన వచ్చింది. కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగేది లేదని వైసీపీ తేల్చి చెప్పేసింది. ఈ మేరకు గురువారం విజయవాడలో కౌంటింగ్ ఏజెంట్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరైన. వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు... ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎటువంటి ఆహ్వానం లేదని, ఒకవేళ పిలిచినా ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఒక్క కామెంట్ తోనే కాంగ్రెస్ తో దోస్తానాపై వైసీపీ వైఖరి స్పష్టమైపోయిందన్న వాదన వినిపిస్తోంది.