Begin typing your search above and press return to search.
టీడీపీ ఎంపీలకు వైసీపీ ఇలా చెక్ పెడుతోందా?
By: Tupaki Desk | 10 Feb 2021 2:30 AM GMTప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ ఆపశోపాలు పడుతోంది. రాష్ట్రంలో పార్టీని నిర్వీర్యం చేయాలని అనుకున్నా.. అది సాధ్యం కాలేదు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పార్టీ మార్చేందుకు ప్రయత్నించినా.. వారికి.. వైసీపీ నేతలకు మధ్య పొసగడం లేదు. దీంతో వైసీపీ వేసిన ఎత్తు పారలేదనే టాక్ వచ్చింది. ఇక - ఇప్పుడు టీడీపీ ఎంపీలు.. వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ లో ఏపీకి జరిగిన అన్యాయంపై వారు నిలదీస్తున్నారు. ఢిల్లీలో మీడియా మీటింగులు పెట్టిమరీ.. ఏపీ సర్కారుపై విరుచుకు పడుతున్నారు.
టీడీపీకి ముగ్గురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు కమ్మనాయకులు. వీరి దూకుడు కూడా మా మూలుగా లేదు. ప్రతి విషయంలోనూ వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో వీరికి చెక్ పెట్టే విషయంలో జగన్ సర్కారు ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్నారు. వైసీపీకి కమ్మ ఎంపీల్లో యువకుడు - విద్యావంతుడు అయిన.. నరసరావుపేట ఎంపీ.. లావు శ్రీకృష్ణ దేవరాయలును రంగంలొకి దింపారు. ఇప్పటి వరకు ఢిల్లీలో వైసీపీ ఎంపీల తరఫున .. విజయసాయిరెడ్డి(రాజ్యసభ) - మిథున్ రెడ్డి(లోక్ సభ) చక్రం తిప్పుతున్నారు. వీరు తప్ప ఇంకెవరూ నోరెత్తడం లేదు.
అయితే.. ఇప్పుడు మాత్రం లావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. టీడీపీ ఎంపీలకు చెక్ పెట్టే బాధ్యత లను ఆయనకు అప్పగించినట్టు వైసీపీలో ప్రచారం జరుగుతోంది. ఇటీవల బడ్జెట్ వచ్చిన తర్వాత.. వైసీ పీ పై టీడీపీ ఎంపీలకు చెక్ పెట్టేలా.. లావు.. ఢిల్లీలో మీడియా మీటింగ్ నిర్వహించారు. నిజానికి ఆ సమయంలో పక్కన సీనియర్ ఎంపీలు ఉన్నారు. అయినా కూడా.. వారిని సైతం పక్కన పెట్టి.. లావుకు 40 నిమిషాల పాటు మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం గమనార్హం. ఈ పరిణామాలను గమనిస్తున్న.. పరిశీలకులు.. టీడీపీ ఎంపీలకు చెక్ పెట్టేందుకు కమ్మ సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు లావును రంగంలోకి దింపారని అంటున్నారు. మరి ఇది మున్ముందు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి.