Begin typing your search above and press return to search.

ష‌ర్మిల పార్టీతో ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌.. టీఆర్ ఎస్ మౌనం అందుకేనా?!

By:  Tupaki Desk   |   12 Jun 2022 1:30 PM GMT
ష‌ర్మిల పార్టీతో ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌.. టీఆర్ ఎస్ మౌనం అందుకేనా?!
X
తెలంగాణ‌లోనూ రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైటీపీ) పెట్టుకున్న ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి.. వైఎస్ ష‌ర్మిల వ‌ల్ల‌.. తెలంగాణ లో ఎవ‌రికి లాభం చేకూరుతుంది? ఎవ‌రికి న‌ష్టం వ‌స్తుం ది? ఇదీ.. ఇప్పుడు ఎన్నిక‌ల ముంగిట రాజ‌కీయ నేత‌లు వేస్తున్న లెక్క‌లు. వైఎస్ అంటే.. ఎంత‌లేద‌న్నా.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో ఇప్ప‌టికీ అభిమానం ఉంది. ఆయ‌న కాలంలో ల‌బ్ధి పొందిన వారు.. ప‌ద‌వులు పొంది న వారు.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఇప్ప‌టికీ వైఎస్‌ను పొడుగుతూనే ఉంటారు.

ముఖ్యంగా ఆయ‌న అభిమానులు ఎస్సీ, ఎస్టీల్లోనూ ఎక్కువ‌గానే ఉన్నారు.. ఇక‌, మైనారిటీ ముస్లిం వ‌ర్గంలో నూ.. వైఎస్ అంటే అభిమానులు ఎక్కువే. కాబ‌ట్టి.. వారంతా రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి ష‌ర్మిల‌కు అనుకూ లంగా మారే ఛాన్స్ ఎక్కువ‌నేది రాజ‌కీయ మేధావుల మాట‌. ఇదేస‌మ‌యంలో ఆయా వ‌ర్గాలు.. తెలంగాణలో టీఆర్ ఎస్ అంటే.. ఒకింత మండిప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ వ్య‌తిరేక ఓటు బ్యాంకు ఏదైనా ఉంటే.. ఈ వ‌ర్గాల్లోని వారు ష‌ర్మిల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే లెక్క‌లు ఉన్నాయి.

బ‌హుశ‌.. అందుకేనేమో.. ష‌ర్మిల‌పార్టీ నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా.. కేసీఆర్ కానీ, ఆయ‌న త‌న‌యు డు కానీ.. పెద్ద‌గా రియాక్ట్ కాకుండా.. మౌనంగా ఉంటున్నారు. క‌ర‌డు గ‌ట్టిన కేసీఆర్ అభిమానులు కూడా.. ష‌ర్మిల‌పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డం లేదు. దీనివ‌ల్ల త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న రెడ్డి, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు.. ష‌ర్మిల‌కు అనుకూలంగా ప‌డితే.. త‌మ‌కు ప్ర‌ధాన శ‌త్రువులుగా ఉన్న‌కాంగ్రెస్‌, బీజేపీల‌కు.. న‌ష్టం జ‌రుగుతుంద‌ని.. కూడా కేసీఆర్ అండ్‌కోలు అంచ‌నాలు వేసుకున్నారు.

అంటే... త‌మ ప్ర‌మేయం లేకుండా.. త‌మ వ్య‌తిరేక ఓటు బ్యాంకు.. కాంగ్రెస్‌కు, బీజేపీకి ప‌డ‌కుండా.. ష‌ర్మిల‌కు ప‌డితే.. అంతిమంగా.. అది త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని.. టీఆర్ ఎస్ భావిస్తోంది. ఇప్పుడున్న ప‌రిస్థితిలో వారికి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే.. కాంగ్రెస్ త‌ర‌ఫున రేవంత్‌రెడ్డి ఎంత దూకుడుగా ఉన్నా.. రెడ్డి వ‌ర్గం ఆయ‌న వెంట న‌డుస్తుందో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది. అదేస‌మ‌యంలో బీజేపీతో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎప్ప‌టికీ న‌డిచే ప‌రిస్థితి లేదు. ఈ నేప‌థ్యంలో వీరి వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీలిపోయి.. ష‌ర్మిల‌కు ప‌డితే.. ఎలానూ త‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని కేసీఆర్ అండ్ కో ప‌క్కా లెక్క‌లు వేసుకుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.