Begin typing your search above and press return to search.
కేసీఆర్ అండ్ కోకు ఆసూయ పుట్టించిన షర్మిల
By: Tupaki Desk | 13 Nov 2022 8:07 AM GMTప్రైవేట్ ఎజెండా పెట్టుకొని జెండా ఎగురేసేటోడికి పరిమితులు కట్టి పడేస్తుంటాయి. ప్రజా సమస్యలే పరామవధి అనుకునేటోళ్లకు హద్దులు ఉండవు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని చూస్తే.. ప్రతి పార్టీకి ఏదో ఒక పరిమితి ఉన్న విషయం కనిపిస్తుంది. ఏపీ విషయానికి వస్తే ఏపీలోని అధికార.. విపక్షాలైన వైసీపీ.. టీడీపీ.. జనసేనలు ఏవీ కూడా బీజేపీ మీద పల్లెత్తు మాట అనేందుకు ఇష్టపడటం తెలిసిందే. రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసినప్పటికి.. మోడీ అండ్ కోను మాట అనే దమ్ము.. ధైర్యం లేని పరిస్థితి. ఏపీ బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ అధికారపక్షం మీద అప్పుడప్పుడు మాత్రమే విమర్శలు చేస్తుంది తప్పించి.. ప్రభుత్వం చేసే తప్పుల్ని నిలదీసి.. కడిగిపారేసే పని ఆ పార్టీకి చెందిన నేతలు చేయని వైనం కనిపిస్తుంది.
తెలంగాణ విషయానికి వస్తే.. అధికార టీఆర్ఎస్ తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్న బీజేపీ మీద దూకుడుగా వ్యవహరిస్తూ విమర్శలు చేస్తుంటుంది. కాంగ్రెస్ తో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీదు కాబట్టి.. తమకు నష్టం కలగనంతవరకు దాన్ని పట్టించుకోని పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. ఆ పార్టీకి తొలి టార్గెట్ టీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా. అయినప్పటికి టీఆర్ఎస్ మీద కొన్నిసార్లు మహా దూకుడుగా.. మరికొన్ని సార్లు అంటిముట్టనట్లుగా మాట్లాడటం కనిపిస్తుంది.
ఈ లెక్కలన్ని ఇలా ఉంటే.. తెలంగాణ వైసీపీ లెక్కనే వేరన్నట్లుగా ఉంది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. రోజుకు ఒకరిని చొప్పున (కొన్ని సందర్బాల్లో ఇద్దరిని) విరుచుకుపడటం కనిపిస్తుంది. మోడీ సంధించిన అస్త్రంగా పలువురు ఆరోపించే షర్మిల.. తనకు అవకాశం రావాలే కానీ.. బీజేపీపైనా నిప్పులు కురిపిస్తూ వ్యాఖ్యలు చేయటం.. అవసరానికి అనుగుణంగా.. పిడిగుద్దుల్లాంటి మాటల్ని సంధించటం చేస్తుంటారు.
తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటిస్తున్న వేళ.. ఆమెకు చెందిన అదికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి అనూహ్య రీతిలో ఒక ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి చేసందేమీ లేదన్న విషయాన్ని.. సూటిగా.. సుత్తి లేకుండా సంధించిన తీరు ముచ్చటేస్తుంది. ఇంతకాలం మోడీ సంధించిన బాణంగా ప్రచారం జరిగిన దానికి భిన్నంగా ఇప్పుడు ఆయన్ను ఉద్దేశించి చేసిన ఘాటు విమర్శ అందరిని ఆకర్షిస్తోంది.
మోడీ చేసిన వ్యాఖ్యకు పర్ ఫెక్టు పంచ్ అన్న తీరులో ఆమె విరుచుకుపడ్డారు. తెలంగాణ అంతటా కమల వికాసం ఖాయమన్న రీతిలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వేళ.. దానికి కొనసాగింపుగా బీజేపీని ఉద్దేశించి విసిరిన పంచ్ పలువురిని ఆకట్టుకుంటోంది. "తెలంగాణా అంతటా కమలం వికసిస్తుంది" అంటున్న మోడీగారు, మీ పూలు వికసించాలి, మా తెలంగాణ ప్రజల చెవుల్లో పెట్టాలి, అంతేనా సారూ? కోచ్ ఫ్యాక్టరీ నుండి ఐటీఐఆర్ వరకు, విభజన హామీల నుండి 2 కోట్ల కొలువుల వరకు, ఇంకెన్ని పూలు వికసింపజేసుకుంటారు? ఎన్ని మా చెవిలో పెడతారు? అంటూ ప్రశ్నించారు.
నిజానికిఈ మాత్రం పదునైన పంచ్ గులాబీ నేతలు కూడా విసిరింది లేదు. నిత్యం మోడీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడే మంత్రి కేటీఆర్ సైతం.. ఈ మాత్రం వాడిగా.. మొనతేలినట్లుగా ఉండే ట్వీట్ పంచ్ ను విసరలేదన్న మాట వినిపిస్తోంది మొత్తానికి మోడీ పర్యటనతో షర్మిల విసిరిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. ఈ తరహా పంచ్ షర్మిలకు మరింత మేలు చేస్తుందంటున్నారు.