Begin typing your search above and press return to search.
పులిచింతల వద్ద మహానేత భారీ విగ్రహం
By: Tupaki Desk | 6 Oct 2019 3:09 PM GMTదివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి భారీ విగ్రహంను పులిచింతల ప్రాజెక్టు వద్ద నెలకొల్పేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ - రవాణా - సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పులిచింతల ప్రాజెక్టు ఆదివారం పులిచింతల జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గలగలా పారుతున్న కృష్ణమ్మ నదికి మంత్రలు అనిల్ యాదవ్, పేర్ని నానీలు పసుపు - కుంకుమ - చీరే - సారెలు సమర్పించారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించిన తరువాత విలేకరుల సమావేశంలో మంత్రులు మాట్లాడారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
ప్రాజెక్టు వద్ద డాక్టర్ కె.ఎల్. రావు విగ్రహంతో పాటుగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 45 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు. వైఎస్ స్మృతివనంను ఏర్పాటు చేసి, అక్కడ పార్కును నిర్మించి పర్యాటకులకు ఆటవిడుపు కలిగేలా, ప్రకృతి అందాలను ఆస్వాదించేలా తయారు చేస్తామన్నారు. అదే విధంగా కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ వంతెన నిర్మిస్తామని దాని పొడుగు దాదాపుగా 4కి.మీ.దూరం ఉంటుందన్నారు. అక్కడి రోడ్లు - భవనాలను నిర్మించి పర్యాటకులకు వసతులకు కల్పిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినట్టు వెల్లడించారు.
ప్రాజెక్టు నిర్మించిన తర్వాత మొట్టమొదటి సారిగా పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం శుభపరిణామం అన్నారు. మరో ఇరవై ఏళ్ల పాటు రాష్ట్రంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నదుల అనుసంధానంతో కృష్ణా - గోదావరి ప్రాంతాలను సస్యశ్యామలం చేయనున్నారని అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం కోసం దివంగత మహానేత వైఎస్సార్ కోట్ల రూపాయలను మంజూరు చేశారని గుర్తు చేశారు. పులిచింతల ప్రాజెక్టుతో ఈ ప్రాంతమంతా పంటలతో పచ్చని పొలాలతో అలరారుతుందని మంత్రులు అన్నారు. మంత్రుల వెంట ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ ఉన్నారు