Begin typing your search above and press return to search.
10న అనంతలో జగన్ యువభేరి
By: Tupaki Desk | 4 Oct 2017 10:47 AM GMTజననేత - వైసీపీ అధ్యక్షుడు జగన్ మళ్లీ తన గళం వినిపించేందుకు రెడీ అయ్యారు. ప్రజా సమస్యలు సహా రాష్ట్ర సమస్యలపై పెద్ద ఎత్తున పోరాడుతున్న ప్రధాన విపక్ష అధినేత.. సీఎం చంద్రబాబుకు చెమటలు పట్టిస్తున్నారనడంలో సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నికలోనే జగన్ దెబ్బకి బాబు చివురుటాకులా ఒణికి పోయి.. ఏకంగా డజను మంది మంత్రులను రంగంలోకి దింపేశాడు. ఇక, లండన్ టూర్ ముగించుకుని వచ్చిన జగన్ తాజాగా మళ్లీ ప్రజా సమస్యలు - రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే యువతను చైతన్యం చేయాలని డిసైడ్ అయ్యారు.
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల సాధనకు ఈ నెల 10న అనంతపురంలో యువభేరి నిర్వహించనున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ మేరకు వై సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ.. మాజీ ఎంపీ అనంత వెంకట రామిరెడ్డి - ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి - ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి - అనంతపురం అర్బన్ సమన్వయకర్త నదీమ్ అహ్మద్ - రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి - తాడిపత్రి సమన్వయకర్త పెద్దా రెడ్డి - కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి - మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామితో కలసి మీడియాతో మాట్లాడారు.
నగర శివారులోని ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న యువభేరీని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కోరారు. విభజన హామీలను సాధించడంలో బాబు సర్కారు పూర్తిగా విఫలమైందని, అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలోనూ అమ్ముడు పోయిందని, హోదా కన్నా ప్యాకేజీ మిన్న అంటూ బాబు నాలిక మడత మాటలు మాట్లాడుతున్నారని శంకర్ నారాయణ విమర్శించారు. ఇదే విషయాలపై పార్టీ అధ్యక్షుడు జగన్ యువతకు వివరిస్తారని, రాష్ట్ర పరిస్థితి, హోదాతో ప్రయోజనాలు, ఉపాధి కల్పన, వంటి కీలక అంశాలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. గతంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చిన విషయాన్ని ఆయన వివరించారు. ఈ పరిణామంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు చెమటలు పట్టడం ఖాయమని అన్నారు.