Begin typing your search above and press return to search.
యువరాజ్ సింగ్ కు గొప్ప శుభవార్త
By: Tupaki Desk | 26 Jan 2022 5:31 AM GMTటీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రయ్యాడు. తన భార్య హజెల్ కీచ్ మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ తన ట్విట్టర్ లో స్వయంగా వెల్లడించారు.
‘నా అభిమానులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఒక శుభవార్త. మాకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఈ సందర్భంగా మా గోప్యతకు భంగం కలిగించకూడదని కోరుకుంటున్నాం’ అని ట్వీట్ చేశాడు.
2016లో యువరాజ్ సింగ్, హజెల్ కీచ్ ల వివాహమైన సంగతి తెలిసిందే. ఇక 19 ఏళ్ల కెరీర్ లో యువరాజ్ టీమిండియా తరుఫున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థ సెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్ సెంచరీలతో కలిపి 8701 పరుగులతోపాటు 111 వికెట్లు పడగొట్టాడు.
ఇక 58 టీ20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేసిన యూవీ బౌలింగ్ లో 29 వికెట్లు పడగొట్టాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమిండియా గెలవడంలో యూవీ పాత్ర మరువలేనిది..