Begin typing your search above and press return to search.

అర్జెంట్ గా ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌ను.. యువీకి స‌ల‌హా!

By:  Tupaki Desk   |   14 Jun 2019 6:01 AM GMT
అర్జెంట్ గా ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌ను.. యువీకి స‌ల‌హా!
X
అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన యవ‌రాజ్ సింగ్ కు ప‌లువురు అభినంద‌న‌లు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉంటే.. యూవీకి సందేశాలు పంపిన వారంద‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించి అంద‌రి దృష్టిలో ప‌డ్డారు రావ‌ల్పిండి ఎక్స్ ప్రెస్ షోయ‌బ్ అక్త‌ర్‌.

తాజాగా మాట్లాడిన ఈ పాక్ ఫాస్ట్ బౌల‌ర్.. యూవీకి బ్ర‌హ్మాండ‌మైన స‌ల‌హాను ఇచ్చారు. యూవీ.. నువ్వు అర్జెంట్ గా ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌ను.. వారితో ఆడుకుంటూ జీవితాన్ని ఆనందంగా గ‌డుపు అంటూ స‌ల‌హా ఇచ్చారు. యూవీ త‌న‌కు గొప్ప స్నేహితుడిగా అక్త‌ర్ అభివ‌ర్ణించారు.

నువ్వు నాకు మంచి ఫ్రెండ్ వి.. త‌మ్ముడివి. ఇప్పుడింక ఆల‌స్యం చేయొద్దు. వెళ్లి వెంట‌నే ఇద్ద‌రు పిల్ల‌ల్ని క‌ను. నీకింకా పిల్ల‌ల్లేరు. కాబ‌ట్టి ఇప్పుడిది నీకు చాలా ముఖ్యం. ఇంత‌కు ముందు బౌల‌ర్ల‌తో ఆడుకున్నావ్‌.. ఇప్పుడు నీ పిల్ల‌ల‌తో ఆడుకునే స‌మ‌యం వ‌చ్చిందంటూ త‌న యూట్యూబ్ చాన‌ల్ లో పేర్కొన్నారు.

2003 ప్ర‌పంచ క‌ప్ లో పాక్ పై జ‌రిగిన మ్యాచ్ లో యూవీ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచ‌రీ చేసి.. జ‌ట్టు విజ‌యం కీల‌క భూమిక‌పోషించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా షోయ‌బ్ అక్త‌ర్ గుర్తు చేశారు. యూవీకి ఇప్ప‌టివ‌ర‌కూ అందిన సందేశాల్లో.. అక్త‌ర్ ప్ర‌త్యేకంగా నిలుస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. ఈ సందేశానికి యూవీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.