Begin typing your search above and press return to search.
క్రికెటర్ కామిక్స్ తో యువీ పెళ్లి కార్డు!
By: Tupaki Desk | 6 Nov 2016 5:17 AM GMTవై.హెచ్.పి.ఎల్.. దీని గురించి మీరు విన్నారా..? చివరి పి.ఎల్. చూస్తుంటే.. ఇదేదో ప్రీమియర్ లీగ్ లానే ఉందని అనుకుంటున్నారా..! కరెక్టే.. అలాంటి లీగే.. కానీ, ఇది యువరాజ్ హేజెల్ ప్రీమియర్ లీగ్! అవును, ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్లపాటు వెంటపడి మరీ ప్రేమించిన హెజెల్ కీచ్ తో పెళ్లికి సిద్ధమౌతున్నాడు. భారీ ఎత్తున పెళ్లి వేడుకలు ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. మామూలుగా అయితే, ఒక వెడ్డింగ్ ప్లానర్ ని పిలిచి పెళ్లి హంగామా బాధ్యతలు అప్పగిస్తూ ఉంటారు. అక్కడి నుంచీ ఈవెంట్ మేనేజర్లే ఏర్పాట్లు చూసుకుంటారు. వధూవరులు హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటారు. కానీ, ఈ జంట మాత్రం అలాకాదు. తమ పెళ్లి పనుల్ని తామే దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రతీ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు.
పెళ్లికి వస్తున్న అతిథులకు ఎలాంటి స్వీట్లు పెట్టాలీ...? ఫంక్షన్ హాల్లో ఎలాంటి సెంటు కొట్టాలి..? వచ్చే అతిథులకు ఎలా స్వాగతం పలకాలీ... ఇలా అన్ని విషయాలనూ జంటగా ఫైనలైజ్ చేస్తున్నారట! ఇక, పెళ్లి కార్డు విషయంలో చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తున్నారు యువీ-హీచ్ జంట. రొటీన్ కి భిన్నంగా తమ పెళ్లి కార్డులపై ఫొటోలకు బదులు... కార్టూన్లూ ఇల్లస్ట్రేషన్లతో డిజైన్ చేయించారు. అంతేకాదు, క్రికెట్ థీమ్ తో ఈ కార్టూన్లు వేయించారు. యువీ పెళ్లి కార్డుల డిజైన్ల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ వివాహ ఆహ్వాన పత్రికకు పెట్టిన పేరేంటో తెలుసా... వై.హెచ్.పి.ఎల్.!
ఇక, పెళ్లి విషయానికొస్తే... రెండుసార్లు ఈ జంట వివాహం చేసుకుంటుంది! గురుద్వార సంప్రదాయం ప్రకారం నవంబర్ 30 చంఢీగడ్ లో పెళ్లి జరుగుతుంది. ఆ తరువాత, హిందూ సంప్రదాయం ప్రకారం గోవాలో డిసెంబర్ 2న పెళ్లి జరుగుతుంది. సంగీత్ - రిసెప్షన్లు ఢిల్లీలో ఏర్పాటు చేశారు. సంగీత్ కార్యక్రమాన్ని చత్తాపూర్ ఫామ్ హౌస్‌లో జరిగితే, రిసెప్షన్ హోటల్లో ఉంటుంది. మొత్తానికి, యువరాజ్ పెళ్లి వేడుకలు ఓ రేంజిలో ఉండబోతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/