Begin typing your search above and press return to search.
యువీపై గృహహింస కేసు
By: Tupaki Desk | 18 Oct 2017 9:50 AM GMTటీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ పై గృహహింస కేసు నమోదైంది. యువీ సోదరుడు జోరవర్ సింగ్ భార్య - బిగ్ బాస్-11 కంటెస్టెంట్ ఆకాంక్ష శర్మ... భర్త జోరవర్ సింగ్ - అత్త షబ్నం సింగ్ లతో పాటు యువీ పై కేసుపెట్టినట్లు ఆమె లాయర్ స్వాతి సింగ్ తెలిపారు. ఆకాంక్ష బిడ్డలను కనాలంటూ జరోవర్ - యువీ తల్లి షబ్నం...ఆకాంక్షపై ఒత్తిడి తెచ్చారు. ఈ విషయంలో యువీ వారి కుటుంబ సభ్యులకు వత్తాసు పలుకుతున్నాడు. యువీ కొన్ని సందర్భాలలో ఆ విషయంలో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అందుకే అతడి పేరును కూడా ఈ కేసులో జతచేయాల్సి వచ్చిందని లాయర్ స్వాతి తెలిపారు.
అయితే, ఈ అంశానికి యువరాజ్ సింగ్ కు ఎటువంటి సంబంధం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళపై మానసికంగా - ఆర్ధికంగా ఒత్తిడి తీసుకువచ్చిన వారిపై - వారికి సహకరించిన వారిపై కూడా ఈ కేసు నమోదు చేయవచ్చిని లాయర్ స్వాతి తెలిపారు. యువీ సోదరుడు జోరవర్ సింగ్ - ఆకాంక్షలకు 2014లో వివాహమైంది. పిల్లలను కనే విషయంలో భార్యా భర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో, ఆకాంక్ష.... పెళ్లైన నాలుగు నెలలకే జరోవర్ నుంచి విడిపోయింది. అప్పటి నుంచి వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. గత సంవత్సరం వారిద్దరూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 21న యువీపై కేసు విచారణకు రానుంది.