Begin typing your search above and press return to search.
నాన్నా..ఓ మంచి నాన్నా
By: Tupaki Desk | 7 April 2015 5:08 PM GMTపుత్ర వాత్సల్యం ఉండటంలో తప్పులేదు. కానీ శృతిమించిన పుత్రవాత్సల్యంతో నోరు పారేసుకుంటేనే తప్పు. అదే పని చేస్తూ చిక్కుల్లో పడుతున్నారు టీమిండియా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, మాజీ క్రికెటర్ యోగ్ రాజ్ సింగ్. ఇప్పటికే గతంలో దోనిపై విమర్శలు చేసిన యోగ్‌రాజ్‌సింగ్.. తాజాగా నోరుపారేసుకున్నారు. ధోనీ దురంహకారని విమర్శించారు. ఇటీవల జరిగిన వన్డే ప్రపంచ కప్ లో యువరాజ్ కు భారత జట్టులో చోటు దక్కకపోవడానికి ధోనీయే కారణమని ఆరోపించారు.
''ధోనీ చేసిందేమీ లేదు. మీడియా వల్లే ధోనీ క్రికెట్ దేవుడయ్యాడు. మీడియా ధోనీని గొప్పగా చిత్రీకరించింది. ఇందుకు అతను అనరుÛడు'' అని యోగ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. యోగ్ రాజ్.. ధోనీని రావణుడితో పోల్చారు. ''ధోనీ దురహంకారి. ఇలాగే అహంకారంతో విర్రవీగిన రావణుడి కథ ముగిసింది. ధోనీ కూడా ఏదో ఒక రోజు మూల్యం చెల్లిస్తాడు. రావణుడి కంటే గొప్పవాడని ధోనీ భావిస్తున్నాడు. 2011 ప్రపంచ కప్ లో ధోనీ యువరాజ్ ను ఆపి బ్యాటింగ్ కు వెళ్లి హీరో అయ్యాడు. 2015 ప్రపంచ కప్ సెమీస్ లో ధోనీ నాలుగో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ కు దిగలేదు'' అని యోగరాజ్ విమర్శించారు.
యువరాజ్‌కు అండగా నిలబడాలనే ఆయన తండ్రి ఆలోచన మంచిదే అయినప్పటికీ.. ఆయన తండ్రి హోదాలో ఉన్న వ్యక్తి, మాజీ క్రికెటర్ కూడా అయిన యోగ్‌రాజ్ ఈ విధంగా వ్యాఖ్యానించడం ఏంటని పలువురు క్రికెట్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.