Begin typing your search above and press return to search.
సానియా ‘జంట’ డ్యాన్స్ చెత్త అనేశాడు
By: Tupaki Desk | 25 July 2015 5:26 AM GMTటెన్నిస్ దిగ్గజం సానియామీర్జా మాంచి హుషారులో ఉన్న సంగతి తెలిసిందే. వింబుల్డన్ డబుల్స్ టైటిల్ చేజిక్కించుకున్న ఆమె.. ఈ మధ్యన శ్రీలంకకు వెళ్లటం.. అక్కడ ఒక మ్యాచ్ లో పాక్ జట్టు విజయం సాధించటంతో డ్యాన్స్ వేయటం తెలిసిందే.
పాక్ క్రికెట్ జట్టులోని సభ్యుడైన తన భర్తతో కలిసి సానియా మీర్జా చిందేసింది. డబ్ స్మాష్ వీడియోలో డ్యాన్స్ చేసిన ఈ జంట హుషారును ప్రతి ఒక్కరూ అస్వాదించారు.ఇద్దరి డ్యాన్స్ కు పలువురు పాజిటివ్ గా స్పందించారు. ఏమైందో కానీ.. భారత్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు మాత్రం ఈ వీడియో అస్సలు నచ్చలేదట.
ఆయన సానియా జంట డ్యాన్స్ ఏమాత్రం బాగోలేదని నిర్మోహమాటంగా చెప్పేయటమే కాదు..చెత్తగా ఉందని తేల్చేశాడు. అయినా.. సానియా.. ఆమె భర్త కలిసి డ్యాన్స్ వేస్తే.. అది బాగోలేదని విమర్శించటం ఏమిటో యువరాజ్ కే తెలియాలి. తన మనసులోని మాటను సోషల్ నెట్ వర్క్స్ లో పోస్ట్ చేయటంతో.. సానియా భర్త షోయాబ్ మాలిక్ ట్విట్టర్ లో స్పందించాడు.
యూవీ.. గ్రౌండ్ లోకి రా చూసుకుందాం అంటూ సరదాగా సవాలు విసిరారు. తమకు సంబంధం లేని విషయాల మీద సెలబ్రిటీలు అంత అత్యుత్సాహంతో కామెంట్లు చేయటం ఏమిటో.. వాళ్లేమీ ప్రొఫెషనల్ డ్యాన్సర్లు కాదు కదా. వాళ్ల డ్యాన్స్ చెత్తగా ఉందా? లేదా? విషయాలపై దృష్టి పెట్టేకన్నా.. ప్రాక్టీస్ మీద ఫోకస్ చేస్తే యువరాజుకు బాగుంటుందేమో.