Begin typing your search above and press return to search.

యువీ ఆవేదనను ట్వీట్ చేసిన రోహిత్

By:  Tupaki Desk   |   11 Jun 2019 8:02 AM GMT
యువీ ఆవేదనను ట్వీట్ చేసిన రోహిత్
X
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ ముంబై లోని ఓ హోటల్ లో క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు.. 19 ఏళ్ల తన క్రికెట్ కెరీర్ కు ముగింపు పలికాడు. భార్య- తల్లితో కలిసి విలేకరుల సమావేశంలో 37 ఏళ్లకు యూవీ క్రికెట్ నుంచి వైదొలగడం గమనార్హం. యూవీ రిటైర్ మెంట్ పై చాలా మంది చాలా రకాలుగా స్పందించినా.. భారత ఓపెనర్ రోహిత్ మాత్రం యూవీ బాధను బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది..

యువరాజ్ సింగ్ భారత జట్టు టీ20 - వన్డే వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రెండింటిలోనూ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికై భారత్ ను విశ్వవిజేతగా నిలిపాడు. అలాంటి గొప్ప క్రికెటర్ రిటైర్మెంట్ ను బీసీసీఐ పట్టించుకోకపోవడం.. కనీసం సన్మానం - సత్కారం చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఏవరూ లేనట్టు హోటల్ లో యూవీ రిటైర్ మెంట్ ప్రకటించడం దుమారం రేపింది..

అయితే యూవీ ఆవేదనను అర్థం చేసుకున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ సంచలన ట్వీట్ చేశారు. ‘నువ్వు ఏదైనాతే సాధించావో అదే కోల్పోయేదాకా నీకు తెలియదు.. సోదరా..నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటా.. ఘన వీడ్కోలుకు నువ్వు అర్హుడివి.. నా మనసులో నిన్ను అమితంగా ప్రేమిస్తుంటా.. నువ్వొక లెజెండ్ గా ఎదగాలి’ అంటూ రోహిత్ ట్వీట్ లో కోరాడు.

దీనికి యూవీ కూడా అంతే ఆవేదనగా స్పందించాడు. ‘నా మనసులో ఏమనుకుంటున్నానో అది నీకు తెలుసు.. లవ్ యూ.. సమయం వచ్చినప్పుడు ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తానని’ యూవీ బాంబు పేల్చాడు..

దీన్ని బట్టి ఈ లెజండరీ యూవీని బీసీసీఐ కానీ టీమిండియా కానీ పట్టించుకోలేదని.. ఘనమైన వీడ్కోలును ఇవ్వలేదని అర్థమైపోయింది. యూవీకి ఘన వీడ్కోలు దక్కకపోవడంపై రోహిత్ చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి తాను గట్టి కౌంటర్ ఇస్తానని యూవీ పేర్కొన్నాడు. ప్రస్తుతం వరల్డ్ కప్ సాగుతున్నందున వివాదాలకు దూరంగా యూవీ ఉన్నట్టు కనిపిస్తోంది.