Begin typing your search above and press return to search.

షోయబ్ కు యూవీ వీడియో పంచ్

By:  Tupaki Desk   |   27 July 2015 4:57 AM GMT


సానియా దంపతులకు.. భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ కు మధ్య నడుస్తున్న ట్విట్టర్ ట్వీట్స్ చురుకుల్లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఆ మధ్యన శ్రీలంలో జరిగిన మ్యాచ్ లో పాక్ విజయం సాధించటం.. దీంతో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా.. ఆమె భర్త.. పాక్ క్రికెటర్ అయిన షోయాబ్ మాలిక్ లు కలిసి.. డబ్ స్మాష్ వీడియోలో చిందులేయటం తలిసిందే.

వీరి డ్యాన్స్ వ్యవహారంపై స్పందించిన యూవీ.. ఇదేమి చెత్త డ్యాన్స్.. భయంకరంగా ఉందంటూ ట్వీట్ చేయటం.. దీనికి స్పందించిన షోయాబ్.. గ్రౌండ్ లోకి రా తేల్చుకుందాం అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించటం తెలిసిందే.

గ్రౌండ్ లోకి రా తేల్చుకుందామని షోబాయ్ అనటంపై తాజాగా యూవీ మరోసారి రియాక్ట్ అయ్యారు. ఈసారి ట్వీట్ కాకుండా.. మైకేల్ జాక్సన్ సాంగ్ అయిన యు రాక్ మై వరల్డ్ అంటూ సింఫుల్ గా స్టెప్పేసి అదరగొట్టిన అతగాడు.. డ్యాన్ అంటే వేయాలి షోయాబ్ మాలిక్ భాయ్ అంటూ మరో పంచ్ వేసేడాడు. తాను చేసిన డ్యాన్స్ వీడియో లింకును పోస్ట్ చేశాడు. అంతేకాదు.. అంతకు ముందు షోయాబ్ వేసిన పంచ్ కు స్పందిస్తూ.. నేను మైదానంలోనే ఉన్నా అంటూ తిరిగి సమాధానం ఇచ్చారు. మరి.. దీనికి షోయాబ్ ఎలా రియాక్ట్ అవుతాడో..?