Begin typing your search above and press return to search.
కన్నడ నటికి మరో క్రికెటర్ క్లీన్ బౌల్డ్!
By: Tupaki Desk | 23 April 2018 6:40 AM GMTక్రికెట్కు సినీ పరిశ్రమకు మధ్య అనుబంధం కొత్తేం కాదు. క్రికెటర్లు పలువురు నటీమణుల్ని ప్రేమించి పెళ్లాడటం తెలిసిందే. అప్పుడెప్పుడో మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ.. షర్మిలా ఠాకూర్ నుంచి మొన్నామధ్యనే పెళ్లాడిన అనుష్క.. కోహ్లీల వరకూ తెలిసిందే. తాజాగా మరో క్రికెటర్ నటి ప్రేమకు క్లీన్ బౌల్డ్ అయినట్లుగా చెబుతున్నారు.
గడిచిన కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నట్లు చెబుతున్న టీమిండియా క్రికెటర్ యజువేంద్ర చహల్.. కన్నడ నటి తనిష్కా కపూర్ ను వివాహం చేసుకోనున్నట్లుగా చెబుతున్నారు.
ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యజువేంద్ర.. గడిచిన కొంతకాలంగా తనిష్కాతో ప్రేమలో ఉన్నట్లు చెబుతారు. వీరిద్దరి మధ్య బంధం ఉందన్న విషయాన్ని రుజువు చేసేలా ఇప్పటికే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు.. వీరిద్దరూ పలు కార్యక్రమాలు కలిసి హాజరు కావటంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందన్న విషయంపై చర్చ సాగుతోంది. ఇక.. సోషల్ మీడియాలో తనిష్క పోస్టులకు చహల్ తప్పనిసరిగా లైక్స్ కొట్టటం.. కామెంట్స్ చేయటాన్ని పలువురు ప్రస్తావిస్తూ వీరిద్దరి మధ్య బంధం ఉన్నట్లుగా చెబుతారు. అయితే.. వీరిద్దరి కుటుంబాల నుంచి మాత్రం అధికారికంగా వీరి పెళ్లి ప్రకటన ప్రస్తావన రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వీరిద్దరి వివాహం ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ఉంటుందన్న మాట మాత్రం జోరుగా వినిపిస్తోంది.