Begin typing your search above and press return to search.
నా పెళ్లి వార్త అవాస్తవం: చహల్
By: Tupaki Desk | 23 April 2018 5:17 PM GMTటీమిండియా యువ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్....కన్నడ నటి తనిష్కతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని....త్వరలోనే వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని ....సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తోన్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా వారిద్దరూ పార్టీలకు, ఫంక్షన్లకు చెట్టాపట్టాలేసుకొని వెళ్లడంతో ఆ పుకార్లకు బలం చేకూరింది. అయితే, తాజాగా, ఆ పుకార్లను చహల్ ఖండించాడు. తనిష్క తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని, తాము పెళ్లి చేసుకోబోతున్నామన్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశాడు. ఇటువంటి రూమర్లను ప్రచారం చేయవద్దని కోరుతూ ట్వీట్ చేశాడు. తన వ్యక్తిగత జీవితాన్ని అందరూ గౌరవించాలని చహల్ విజ్ఞప్తి చేశాడు.
తనిష్కతో చహల్ పెళ్లి అంటూ....సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలను చహల్ కొట్టిపడేశాడు. తామిద్దరం మంచి స్నేహితులమని, అంతకు మించి తమ మధ్య ఏమీలేదని ట్వీట్ చేశాడు. `` హలో.....అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నా పెళ్లి తనిష్కతో జరగడం లేదు. ఆమెను నేను పెళ్లి చేసుకోవడం లేదు. తనిష్క, నేను మంచి స్నేహితులం. దయచేసి ఇటువంటి అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని నా అభిమానులను, మీడియా సంస్థలను కోరుతున్నా. నన్ను..నా వ్యక్తిగత జీవితాన్ని మీరందరూ గౌరవిస్తారాని ఆశిస్తున్నా. దయచేసి ఈ రూమర్లను ఆపేయండి. నా పెళ్లిపై అర్థంపర్థం లేని పోస్టులు పెట్టకండి. ఇదే కాదు, ఏదైనా పోస్ట్ సోషల్ మీడియాలో పెట్టేముందు అది నిజమా...కాదా అని కన్ ఫర్మ్ చేసుకున్న తర్వాతే పోస్ట్ చేయండి..ధన్యవాదాలు’’ అని చహల్ ట్వీట్ చేశాడు. గతంలో కూడా విరుష్క జంటపై పెళ్లికి ముందు ఇటువంటి పుకార్లే వచ్చాయి. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా ఈ జంట కూడా పెళ్లి చేసుకుంటారని నెటిజన్లు భావించి పోస్టులు పెట్టారు.