Begin typing your search above and press return to search.

బాబు బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన సుబ్బారెడ్డి

By:  Tupaki Desk   |   4 April 2017 10:47 AM GMT
బాబు బుద్ధిని బ‌య‌ట‌పెట్టిన సుబ్బారెడ్డి
X
ప్రజాస్వామ్యం న‌వ్వుల పాల‌య్యే పార్టీ ఫిరాయింపుల ప‌ర్వానికి పాల్ప‌డ‌ట‌మే కాకుండా మంత్రివ‌ర్గంలో చేసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తీరు సిగ్గుచేట‌ని వైఎస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. ఇతర పార్టీ సింబల్ పై గెలిచిన వారిని రాజీనామాలు చేయంచకుండ చంద్రబాబు ఏవిధంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారని వైవీ నిలదీశారు. పార్టీ మారిన వారికి కేబినెట్ లో చోటు క‌ల్పించ‌డం దారుణమ‌ని, చంద్ర‌బాబు దిగ‌జారుడుత‌నాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ నెల 7 న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ధ‌ర్నాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్ల‌డించారు.

రాజ్యాంగాన్ని ఉల్లంఘించ‌డం చంద్ర‌బాబుకి కొత్త‌కాదని వైవీ సుబ్బారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు జీవితమంతా ఎమ్మెల్యేల‌ను కొన‌డ‌మేన‌ని, ఆయ‌న గ‌త చ‌రిత్ర తెలిసిన వారికి ఇది అర్థ‌మ‌వుతుంద‌ని అన్నారు. ప‌ద‌వులు పొందిన న‌లుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని లీకులివ్వ‌డ‌మేంటని సుబ్బారెడ్డి ప్ర‌శ్నించారు. ఒక‌వేళ నిజంగా రాజీనామా చేస్తే ఆమోదించండని స‌వాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు మంత్రి ప‌ద‌వులు అనైతికమ‌ని, ఈ ఫిరాయింపుల వ్య‌వ‌హారం ఒక్క పార్టీల‌కు సంబంధించింది కాదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీ మారిన వారిపై నిర్ణీత స‌మ‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ సర్కార్ రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలను నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ప్ర‌ధాన కార్యాల‌యాల్లో ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవించే అన్ని పార్టీలు, మేధావులు, ప్రజలు, ప్రజాసంఘాలు కలిసిరావాలని కోరారు.

ఇదే విషయంపై తమ నాయకుడు వైఎస్ జగన్ గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశార‌ని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ రెండు మూడు రోజుల్లో రాష్ట్రపతి, ప్రధానిని కూడా కలవనున్నట్టు చెప్పారు. జాతీయస్థాయిలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని భావించే అన్ని పార్టీలను వైఎస్ జగన్ నాయకత్వంలో కలిసి మద్దతు కూడగ‌డుతామ‌ని అన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల్ని వివరిస్తామన్నారు. పార్లమెంట్ లో కూడా టీడీపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ఎండగడుతామని సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/