Begin typing your search above and press return to search.
అజిత్ ధోవల్ పేరిట ట్వీట్ సంచలనం..వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి
By: Tupaki Desk | 23 Feb 2020 2:47 PM GMTజాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేరిట ఓ నకిలీ ట్విటర్ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. తొలుత ప్రభుత్వ వర్గాలు కంగారుపడినా ఆ తరువాత అది అజితో ధోవల్ అసలు అకౌంట్ కాదని, నకిలీ ఖాతా అని తెలుకున్నాక దానిపై చర్యలకు రెడీ అవుతున్నాయి. ఈ మేరకు ఈ తప్పుడు ప్రచారంపై ఖండనలూ వచ్చాయి.
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) నుంచి రూ.2300 కోట్లు ఏపీ ఖజానాకు తరలించారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేరిట సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. దీనిపై టీటీడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై టీటీడీ వర్గాలు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాయి. అజిత్ దోవల్ పేరిట జరుగుతున్న నకిలీ ప్రచారంపై నిగ్గు తేల్చాలని తమ ఫిర్యాదులో కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కాగా అజిత్ ధోవల్ వంటి వ్యక్తి పేరుతో ఈ ట్వీట్ వ్యాపిస్తుండడంతో ప్రజల్లో ప్రభావం చూపుతుందన్న ఉద్దేశంతో వైసీపీ నుంచి చర్యలు వేగవంతం చేశారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. దేవుడి సొమ్మును ఇష్టం వచ్చినట్టు వాడడానికి లేదని, భక్తుల కోసం మాత్రమే ఆ సొమ్ము వినియోగించాల్సి ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ఇలాంటి తప్పుడు వార్తలను సోసల్ మీడియాలో ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టీటీడీ వ్యవహారాల కోసం త్వరలోనే సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.