Begin typing your search above and press return to search.
బాబాయ్ మాట : డేట్ చెప్పను...విశాఖే రాజధాని మరి...
By: Tupaki Desk | 25 July 2022 7:33 AM GMTఆయన చెప్పారూ అంటే ఎంతో కొంత నమ్మాల్సిందే. ఎందుకంటే ఆయన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి సొంత బాబాయ్. ఆయన పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఏ రకమైన స్టేట్మెంట్స్ అయితే అసలు ఇవ్వరు. అంత వరకూ నమ్మొచ్చు. ఇక బాబాయ్ విశాఖ రాజధాని గురించి లేటెస్ట్ గా బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు.
విశాఖకు పరిపాలనా రాజధాని రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎపుడు ఏమిటీ. తేదీలు వివరాలూ వగైరాలూ అన్నీ నన్ను అడగవద్దు. అయితే ఏదో నాడు విశాఖ రాజధాని అయి తీరుతుంది. ఇది తధ్యమని వైవీ సుబ్బారెడ్డి విశాఖ టూర్ లో మీడియా ఎదుట కడు విశ్వాసంతో చెప్పారు.
ఇక చూస్తే న్యాయపరమైన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి అని ఆయన కూడా అంటున్నారు. అయినా సరే అన్నింటికీ అధిగమించి విశాఖకు రాజధాని తీసుకురావడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని సుబ్బారెడ్డి ధీమాగా చెబుతున్నారు.
ఇక విశాఖను అభివృద్ధి చేయడంతో వైసీపీ సర్కార్ చాలా దూరదృష్టితో ప్రణాళికలను రూపొందిస్తోందని కూడా ఆయన చెప్పారు. ఇక విశాఖలో ఉన్న 98 వార్డులను అన్నింటికీ పరిగణమలోకి తీసుకుని వార్డుల వారీగా అభివృద్ధి చేస్తామని సుబ్బారెడ్డి చెప్పారు.
ఇవన్నీ పక్కన పెడితే మొన్నటికి మొన్న వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి రాజధానిగా విశాఖ ఉండబోతోంది అని ప్రకటించేశారు. నిన్నటికి నిన్న యువ మంత్రి గుడివాడ అమరనాధ్ విశాఖ మన రాజధాని అన్నారు. దానికి ముందు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా విశాఖ రాజధాని అయి తీరుతుంది అని చెప్పేశారు. ఇపుడు వైవీ సుబ్బారెడ్డి నోటి వెంట కూడా ఇదే మాట రావడంతో అసలు వైసీపీ సర్కార్ లో ఏమి జరుగుతోంది అన్న చర్చ అయితే మొదలైంది.
వైసీపీకి, జగన్ కీ చూస్తే తాము అనుకున్నది చేస్తారు అన్న మాట ఉంది. విశాఖ విషయంలో కూడా పట్టుదల వారికి ఉందని అంతా నమ్ముతున్నారు. అయితే న్యాయపరంగా చూస్తే వీలు కాని పరిస్థితి. ఎలాంటి ప్రయోగాలు చేయడానికైనా చూస్తే ఉన్న అధికార సమయం గట్టిగా ఇరవై నెలలు మాత్రమే. మరి విశాఖ రాజధాని అవుతుంది అని వైసీపీ పెద్దలు అంటున్నారు. డేట్లు అడగవదు, విశాఖ ఫేట్ మార్చేది మేమే అని కూడా బల్లగుద్దుతున్నారు. మరి ఏం జరుగుతోంది. ఏం జరగబోతోంది అంటే వేచి చూడాల్సిందే మరి