Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీలు రాజీనామా ఎందుకు చేయ‌ట్లేదంటే..

By:  Tupaki Desk   |   11 Oct 2017 4:35 AM GMT
వైసీపీ ఎంపీలు రాజీనామా ఎందుకు చేయ‌ట్లేదంటే..
X
ఒక వేలు ఎదుటి వారిని చూపిస్తే.. మూడు వేళ్లు మ‌న‌ల్ని చూపిస్తాయనేది పెద్ద‌ల మాట‌! హోదా ఇస్తామ‌ని ఎన్నో మాట‌లు చెప్పి.. ఆశచూపి.. చివ‌ర‌కు న‌ట్టేట ముంచేసింది బీజేపీ! హోదా బ‌దులు ప్యాకే జీ ఇస్తామ‌ని చెప్పినా.. దానిని నిర‌సించ‌కుండా, హోదా కోసం పోరాటాన్ని తుంగ‌లో తొక్కేసింది టీడీపీ! ఇప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం తొలి నుంచి పోరాడుతూ.. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ కేంద్రం వైఖ‌రిని నిర‌సిస్తూ.. చివ‌ర‌కు ఎంపీల‌తో రాజీనామా చేయించ‌యినా కేంద్రంపై ఒత్త‌డి తెచ్చేందుకు కంక‌ణం క‌ట్టుకున్న‌ వైసీపీపై టీడీపీ బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తోం ది! ముందు వైసీపీ ఎంపీల‌తో రాజీనామా చేయించాల‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నారు నేత‌లు! దీనికి కౌంట‌ర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి!! తామెందుకు రాజీనామాలు చేయ‌డంలేదో స్ప‌ష్టంచేశారు!

ప్ర‌త్యేక హోదా కోసం టీడీపీ పోరాడ‌దు.. పోరాటం చేసే వాళ్ల‌ని అణిచివేసేందుకు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుంది!! హోదా కోసం టీడీపీ నాయ‌కులు మాట్లాడ‌రు.. ఎవ‌రైనా మాట్లాడితే వాళ్ల‌పై ఎదురు దాడికి దిగుతారు!! హోదా ఇవ్వాల‌ని కేంద్రంపై సీఎం చంద్ర‌బాబు ఒత్తిడి తీసుకురాలేదు.. ఎవ‌రైనా ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తే వారిపై వీలైనంత‌గా బుర‌ద జల్లి.. ఆ అంశాన్ని మ‌సిపూసి మారేడుకాయ చేసేదాకా ఊరుకోరు!! ఏపీ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట కోసం వైసీపీ నేత అధినేత జ‌గ‌న్ పోరాడుతున్నారు. ఎంపీలు పార్ల‌మెంట్‌ లో కేంద్రాన్ని నిల‌దీస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తమ పార్టీ ఎంపీల రాజీనామా అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌ తో భేటీ అయిన సంద‌ర్భంగా... కేంద్ర మంత్రి ఇంటి బ‌య‌టే మీడియాతో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి... త‌మ ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసే విష‌యంలో పార్టీ అధినేత మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పారు. రాజీనామా చేసేయాల‌ని ఇప్ప‌టికిప్పుడు జ‌గ‌న్ అదేశాలు జారీ చేస్తే మ‌రుక్ష‌ణ‌మే రాజీనామాలు చేసేందుకు త‌మ పార్టీ ఎంపీల‌మంతా సిద్ధంగానే ఉన్నామ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే రాజీనామాలను అంతిమ అస్త్రంగానే ప‌రిగ‌ణిస్తున్నామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. అస‌లు హోదా కోసం పోరాడుతున్న తాము రాజీనామాలు చేస్తే... పార్ల‌మెంటులో హోదా కోసం పోరాడే వారు ఉండ‌రు క‌దా అని కూడా ఆయ‌న మీడియాను ప్ర‌శ్నించారు. వెర‌సి రాజీనామాల‌కు తామేమీ వెనుకాడ‌టం లేద‌ని, స‌రైన స‌మ‌యంలో చివ‌రి అస్త్రంగా వాటిని ప్ర‌యోగిస్తామ‌ని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.