Begin typing your search above and press return to search.

జగన్ కూడా అదే భ్రమలో ఉన్నారా సుబ్బారెడ్డి

By:  Tupaki Desk   |   18 April 2016 6:25 AM GMT
జగన్ కూడా అదే భ్రమలో ఉన్నారా సుబ్బారెడ్డి
X
ఊహించని విధంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై అధినేతలు ఏమనుకుంటున్నారు? ఆయా అంశాల మీద వారి రియాక్షన్ ఎలా ఉంటుందన్న విషయంపై చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. తాజాగా ఏపీ రాజకీయాల్నే తీసుకోండి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ ను షురూ చేశారు. ఆయన స్టార్ట్ చేసిన ఆకర్ష్ తో పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సైకిల్ ఎక్కేందుకు తపిస్తున్నారు.

ఒక జిల్లా తర్వాత మరో జిల్లా అన్నట్లుగా జగన్ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోవటానికి.. మెడలో పచ్చ కండువా కప్పుకోవటానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మరి.. ఇలాంటి పరిస్థితుల్లో విపక్ష నేత వైఎస్ జగన్ ఏమనుకుంటున్నారు? ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది? అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొద్దిరోజులుగా జగన్ మాట్లాడుతున్నది లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మాట్లాడటమే కాదు.. జగన్ మీడియాలో కనిపించటం లేదు కూడా.

ఇలాంటప్పుడు తాజా జంపింగ్స్ మీద జగన్ మైండ్ సెట్ ఏమిటన్నది అంతు చిక్కనిదిగా మారింది. అయితే.. జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వైవి సుబ్బారెడ్డి మాటల్ని విన్నప్పుడు విపక్ష నేత మైండ్ సెట్ ఇప్పుడెలా ఉందన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా ఉంది. తాజాగా అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావటంతో.. ఆ విషయంపై ఆరా తీసేందుకు విజయసాయిరెడ్డి.. సుబ్బారెడ్డి తదితరులు అనంతపురంలో పర్యటిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైవి సుబ్బారెడ్డి.. కొందరు ఎమ్మెల్యేలు డబ్బు వ్యామోహంతో పార్టీ మారుతున్నా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. డబ్బు కోసం.. పదవుల కోసం పార్టీని విడిచిపెడుతున్న ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వదిలిపెడుతున్నారని.. ఎమ్మెల్యేలతోపాటు కార్యకర్తలు ఎవరూ పార్టీని విడిచిపెట్టటం లేదని సుబ్బారెడ్డి చెబుతున్నారు. చంద్రబాబు తనదగ్గరున్న డబ్బుతో పార్టీ ఎమ్మెల్యేల్ని కొంటున్నారు కానీ క్యాడర్ ను కాదంటూ చెబుతున్న మాటలు వింటే జగన్ మైండ్ సెట్ ఇట్టే అర్థం కాక మానదు. నాయకులు పార్టీ మారితే క్యాడర్ మాత్రం మారరా? ఒకవేళ జగన్ బ్యాచ్ చెబుతున్న లాజిక్కే కరెక్ట్ అయితే.. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్.. ఆ పార్టీకి చెందిన క్యాడర్ ను బయటకు తీసుకురాలేదని చెప్పగలమా? మరి.. ఈ లాజిక్ చూస్తే.. జగన్ బ్యాచ్ చెప్పే మాటలు మేకపోతు గాంభీర్యాన్ని తలపించక మానవు.