Begin typing your search above and press return to search.
సుబ్బారెడ్డి క్లారిటీ: నేను హిందువునే!
By: Tupaki Desk | 7 Jun 2019 4:16 AM GMTసోషల్ మీడియా.. వాట్సాప్ పుణ్యమా అని అసలు కంటే కొసరు వార్తలే ఎక్కువ రార్ధాంతం చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ పదవిని పార్టీకి అత్యంత విధేయులు.. సీనియర్ నేత కమ్ బాబాయ్ సుబ్బారెడ్డికి కేటాయిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. అన్ని మీడియా సంస్థలతో పాటు.. జగన్ పత్రిక సాక్షిలోనూ ఇదే విషయాన్ని తెలిసింది పేరుతో వార్త ఇవ్వటంతో.. సుబ్బారెడ్డికి టీడీడీ ఛైర్మన్ పోస్ట్ ఖాయమన్న విషయం తేలిపోయింది.
సుబ్బారెడ్డిని టీటీడీ ఛైర్మన్ పదవికి ఎంపిక చేశారన్న వార్త వచ్చిన కాసేపటికే.. ఆయన క్రిస్టియన్ అని.. హిందువు కాదని.. అలాంటి వ్యక్తిని టీటీడీ ఛైర్మన్ పదవికి ఎలా ఎంపిక చేస్తారంటూ దుర్మార్గపు ప్రచారం స్టార్ట్ అయ్యింది. ఇది అంతకంతకూ పెరిగిపోవటమే కాదు.. అబద్ధం కాస్తా నిజమని ప్రజలు నమ్మే వరకూ వెళుతున్న పరిస్థితి.
ఇలాంటి వేళలో సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యారు. తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేస్తూ.. తాను హిందువునని.. తమ ఇష్ట దైవం శ్రీనివాసుడేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా చేస్తానని.. టీటీడీ ఛైర్మన్ పదవి రావటం తన అదృష్టంగా ఆయన అభివర్ణించారు. తనకు ఛైర్మన్ పోస్టు వస్తే.. స్వామివారి ఆస్తులు.. ఆభరణాల అవకతవకలపై వాస్తవాలు వెలుగులోకి వచ్చేలా విచారణ జరిపిస్తానని వ్యాఖ్యానించారు.