Begin typing your search above and press return to search.
కేవీపీతో మనస్పర్ధలు లేవు: వైవీ
By: Tupaki Desk | 5 Feb 2018 12:59 PM GMT కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీకి రామచంద్రరావు - తనకు మధ్య జరుగుతున్న ప్రచారంపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. మాజీ ఉమ్మడిరాష్ట్రాల సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కేవీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ మరణం తరువాత ఆయన జగన్ వెంట నడుస్తారని అందరు అనుకున్నారు. కానీ కేవీపీ కాంగ్రెస్ లో కొనసాగుతూ జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి తనకి - కేవీపీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తన వల్లే కేవీపీ జగన్ ను కలవలేకపోతున్నారనేది అవాస్ధవమని సూచించారు. కొన్ని సమస్యలవల్ల వైసీపీలోకి రాలేదేమో..! అవేంటో కేవీపీనే అడగాలన్నారు.
విజయమ్మ - షర్మిల పార్టీ కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉన్నారన్న ప్రశ్నలకు వారి అవసరం పార్టీకి ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు వారిని సంప్రదిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వైసీపీ గౌరవాధ్యక్షులుగా వైఎస్.విజయమ్మ కొనసాగుతున్నారని గుర్తు చేశారు.
జగన్ కు - షర్మిల మధ్య మనస్పర్ధలు వచ్చాయని - అందుకే షర్మిల పార్టీకి దూరంగా ఉన్నారన్న వార్తలు అవాస్తవమని అన్నారు. ప్లీనరీకి షర్మిల వచ్చారని - జగన్ చేస్తున్న పాదయాత్రకు కూడా వస్తారని తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్ .విజయమ్మ రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే విషయం పై స్పష్టత లేదన్నా వైవీ సుబ్బారెడ్డి