Begin typing your search above and press return to search.

జగన్ ఇంటి నుంచే విశాఖ ఎంపీ అభ్యర్ధి....?

By:  Tupaki Desk   |   29 Dec 2022 3:46 AM GMT
జగన్ ఇంటి నుంచే విశాఖ ఎంపీ అభ్యర్ధి....?
X
జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి అని అందరికీ తెలిసిందే. ఆయన 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక 2019 నాటికి ఆయనకు టికెట్ దక్కలేదు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి జగన్ సాటిస్ ఫై చేశారు. రెండేళ్ల పదవీ కాలం పూర్తి అయ్యాక ఆయనకు మరో విడత కంటిన్యూ చేశారు.

ఈ ఏడాది ఆగస్ట్ నాటికి ఆ పదవి పూర్తి అవుతుంది. అయితే ఈ మధ్యలోనే అంటే కొత్త ఏడాది మొదటి నెలలోనే వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగించేసి కొత్త వారికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. మరి వైవీని ఏం చేస్తారు అంటే ఆయన మీద చాలా పెద్ద బాధ్యతలే మోపబోతున్నారు అని అంటున్నారు.

వైవీ సుబ్బారెడ్డి విశాఖ అనకాపల్లి విజయనగరం జిల్లాల ఇంచార్జిగా ఉన్నారు. అయితే అయన పార్టీ పనుల మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. టీటీడీ పోస్ట్ చాలా కీలకం అయినది. అంతే కాదు ఆయన అటు హైదరాబాద్ ఇటు తిరుపతి మధ్యలో విశాఖ అన్నట్లుగా టూర్లు వేస్తున్నారు. వైసీపీ వరకూ చూస్తే విశాఖ ఇంపార్టెంట్. అందుకే ఆయనకు పూర్తి బాధ్యతలు ఇవ్వడానికే ఇలా చేస్తున్నారు అంటున్నారు.

మరో న్యూస్ కూడా ఇపుడు చక్కర్లు కొడుతోంది అదేంటి అంటే విశాఖ ఎంపీ సీటుకు వైసీపీ నుంచి సరైన క్యాండిడేట్ లేరు. ప్రస్తుతం ఉన్న ఎంవీవీ సత్యనారాయణకు వచ్చేసారి టికెట్ ఇవ్వరని అంటున్నారు. ఆయనకు విశాఖ తూర్పు అసెంబ్లీ టికెట్ ఇస్తారని చెబుతున్నారు. అదే టైం లో విశాఖ నుంచి బిగ్ షాట్స్ విపక్షాల నుంచి బరిలోకి దిగే చాన్స్ ఉంది. దాంతో అర్ధబలం అంగబలం రెండూ ఉన్న వారిని వైసీపీ దింపాలని చూస్తోంది.

ఆ విధంగా చూస్తే వైవీని మించిన వారు ఉండరనేది ఆ పార్టీ హై కమాండ్ ఆలోచన. మరి విశాఖ ఎంపీ అంటే ఇప్పటి నుంచే సర్దుకోకపోతే ఎన్నికల వేళకు కుదరదు అని అంటున్నారు. దాంతో వైసీపీ వైవీని విశాఖ ఎంపీగా పోటీ చేయించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అంటున్నారు. ఇక మీదట ఆయన విశాఖలోనే మకాం ఏర్పాటు చేసుకుని తన యాక్టివిటీని స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు.

నిజానికి విశాఖ ఎంపీ సీటు మీద రాజ్యసభ మెంబర్ విజయసాయిరెడ్డి కి కన్ను ఉంది అని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఆయనను ఉత్తరాంధ్రా బాధ్యతల నుంచి తప్పించారు. ఇపుడు వైవీ సుబ్బారెడ్డిని ఎంపీగా దింపితే సానుకూల ఫలితాలు వస్తాయని, ఆయన ఎంపీ క్యాండిడేట్ అయితే మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్ధులను కూడా గెలిపించుకునేందుకు వీలు అవుతుందని అంటున్నారు. ఈ ప్రచారం కనుక నిజం అయితే వైవీ పూర్తిగా విశాఖకు మకాం మారుచ్కోవాల్సిందే. వైవీ కేరాఫ్ విశాఖ కావాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.