Begin typing your search above and press return to search.
ఆనందయ్య మందు అందించాలనుకున్నాం కానీ.. - వైవీ సుబ్బారెడ్డి
By: Tupaki Desk | 1 Jun 2021 3:07 PM GMTఆనందయ్య మందు పంపిణీపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మందు పంపిణీని చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నట్టు చెప్పారు. తాము నిజానికి ఆనందయ్య మందు పంపిణీకి సహాయం చేయాలనే అనుకున్నప్పటికీ.. కేంద్ర సంస్థ సీసీఆర్ఏఎస్ ఇచ్చిన నివేదిక ప్రకారం వెనక్కు తగ్గినట్టు చెప్పారు.
ఆ నివేదిక ప్రకారం.. ఆనందయ్య మందు ఆయుర్వేదం కాదని తేలిందన్నారు. ఈ మందు వాడడం వల్ల కరోనా తగ్గుతుందని నిర్ధారణ కూడా జరగలేదని ఆ సంస్థ చెప్పిందన్నారు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇవ్వడంతో తాము కూడా పునరాలోచన చేశామని చెప్పారు.
అయితే.. ఎవరి నమ్మకం వారిదని చెప్పిన సుబ్బారెడ్డి.. ఆనందయ్య మందువల్ల హానిలేదని తేలినందున కావాలనుకున్న వారు మందు తీసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందని తెలిపారు. అయితే.. కొవిడ్ బాధితులు అల్లోపతి చికిత్సతోపాటు, ప్రొటోకాల్స్ మాత్రం పాటించాల్సిందేనని చెప్పారు.