Begin typing your search above and press return to search.

టీటీడీపై పుకార్లు న‌మ్మొద్దు: శ‌్రీవారి ద‌య‌తో జీతాల్ క‌ట్ చేయ‌లే

By:  Tupaki Desk   |   21 May 2020 4:00 PM GMT
టీటీడీపై పుకార్లు న‌మ్మొద్దు: శ‌్రీవారి ద‌య‌తో జీతాల్ క‌ట్ చేయ‌లే
X
మ‌హ‌మ్మారి వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన కార్య‌క‌లాపాల‌న్నీ నిలిచిపోయాయి. ప్ర‌ధాన ఆల‌యం మూసివేయ‌డంతో భ‌క్తులు రాలేదు. దీంతో ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప‌రిస్థితుల్లో ఉన్న ఉద్యోగుల‌కు జీతాలు కోత విధించార‌ని, వారంద‌రికీ జీతాలు అందించ‌లేద‌ని వ‌చ్చిన పుకార్ల‌పై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అవ‌న్నీ పుకార్లేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఉద్యోగుల జీతాల్లో కోత విధించినట్లు వస్తున్న వార్తలు నిజం కావ‌ని కొట్టిపారేశారు. వేంకటేశ్వర స్వామి దయ వలన ఉద్యోగులకు జీతాలు ఇచ్చేంత నిధులు టీటీడీ వద్ద ఉన్నాయి. జీతాల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను భక్తులు నమ్మకండి అని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులు త్వరలోనే చక్కబడాలని కోరుకోండి అని సూచించారు. ఇంతవరకు జీతాలను సమయానికి ఇచ్చామ‌ని, భవిష్యత్‌లో కూడా ఎలాంటి కోతలు లేకుండా జీతాలను ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. లాక్‌డౌన్‌తో దాదాపుగా రెండు నెలలుగా తిరుమలకు భక్తుల రాకపై నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. భక్తులను అనుమతించక‌పోయినా రోజు స్వామి వారికి కైంక‌ర్యాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు.