Begin typing your search above and press return to search.
అమరావతిలోమీ పాత్ర విలనా? వ్యాంపా?
By: Tupaki Desk | 23 July 2015 4:51 AM GMTరాజకీయాలు అన్నాక మాటా.. మాటా అనుకోవటం మామూలే. కానీ.. మాటలు అనాలి కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే లేనిపోని ఇబ్బందులు తప్పవు. తరచూ టీవీ చర్చల్లో.. టీడీపీ తరఫున బలమైన వాదనను వినిపిస్తూ.. మిగిలిన తమ్ముళ్లతో పోలిస్తే.. తన వాదనను సమర్థంగా వినిపించే అతికొద్ది తెలుగుదేశం నేతల్లో వైవీబీ రాజేంద్రప్రసాద్ ఒకరు.
రాష్ట్ర విభజన సమయంలో.. చంద్రబాబు తరఫున మాట్లాడటం అంత చిన్న విషయం కాదు. చాలా బ్యాలెన్స్ తో ఎక్కడా గతి తప్పకుండా.. తాను నమ్మిన వాదాన్ని వినిపించే విషయంలో రాజేంద్రప్రసాద్.. సీమాంధ్రుల మనసుల్ని దోచుకున్నారు అదే సమయంలో.. తన వ్యాఖ్యల కారణంగా.. తెలంగాణ తెలుగుదేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు.
ఆయన పడిన కష్టానికి తగ్గట్లే ఈ మధ్యనే ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. ఆచితూచి మాట్లాడి.. అందరిని ఆకట్టుకునే రాజేంద్రప్రసాద్.. తాజాగా మాత్రం కాస్తంత హద్దు మీరి విమర్శలకు దిగినట్లుగా కనిపిస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. ఫైర్ బ్రాండ్ రోజాను ఉద్దేశించి చేసిన విమర్శల సందర్భంగా ఆయన చేసిన విమర్శలు హుందాగా లేకుండా.. వెకిలిగా ఉన్నాయన్న విమర్శ వినిపిస్తోంది. నిజమే.. ఫైర్ బ్రాండ్ రోజాపై మాటల దాడి చేసే సమయంలో కాస్తంత దూకుడు అవసరమే. కానీ.. దానికి హద్దులు ఉంటాయన్న విషయాన్ని మర్చిపోయినట్లున్నారు.
ఏపీ రాజధాని.. మాస్టర్ ప్లాన్ అంశాలపై ఈ మధ్య రోజా స్పందిస్తూ.. మగధీర.. బాహుబలి సినిమాలను తలపించేలా బాబు చేస్తున్నారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ ఇచ్చిన రాజేంద్రప్రసాద్.. తెలిసో.. తెలియకో రోజా చెప్పినట్లు.. బాహుబలి.. మగధీరలు అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేశారని.. అలాగే తమ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక అసాధ్యాన్ని చేసి చూపిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇంతవరకూ కౌంటర్ పద్ధతిగా నడిచినా.. ఇక్కడే గతి తగ్గింది. ఇంతకీ అమరావతిలోమీ పాత్ర విలనా? వ్యాంపా? అని ప్రశ్నించిన ఆయన.. దానికి తానే సమాధానం ఇస్తూ.. విలన్ పాత్రకు జగన్ ఉన్నారని.. కాబట్టి..వ్యాంప్ పాత్ర మీదేనంటూ తీవ్రంగా మండిపడ్డారు. తిట్టటం బాగానే ఉంటుంది కానీ.. మరీ.. ఇలా హద్దులు దాటేయటం ఏమాత్రం బాగోదని రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యల్ని పలువురు తప్పు పడుతున్నారు.