Begin typing your search above and press return to search.

అదానీకి జడ్ కేటగిరి భద్రత ?

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:00 PM IST
అదానీకి జడ్ కేటగిరి భద్రత ?
X
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం తాజాగా జడ్ కేటగిరి భద్రతను కల్పించింది. అదానీని బెదిరిస్తు ఎవరి నుండో ఫోన్ కాల్ వచ్చిందని ఫిర్యాదు చేశారు. దాంతో వెంటనే అదానీకి జడ్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించటమే ఆశ్చర్యంగా ఉంది.

అదానీకి ప్రాణహాని ఉందని నిఘా సంస్థల నుండి వచ్చిన నివేదిక ప్రకారమే కేంద్ర హోంశాఖ జడ్ కేటగిరి కల్పించాలని డిసైడ్ అయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఒకవైపు ప్రముఖులకు జడ్ కేటగిరి అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నది. ఇప్పటివరకు జడ్ కేటగిరి భద్రత ఉన్న ప్రముఖులకు భద్రతను తొలగిస్తున్నది. ఇదే సమయంలో నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితులైన అదీనీ, ముఖేష్ అంబానీలకు జడ్ కేటగిరి భద్రతను కల్పిస్తోంది. ముఖేష్ కు జడ్ ప్లస్ కేటగిరి ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే.

అదానీకి కేటాయించిన జడ్ కేటగిరీలో సీఆర్పీఎఫ్ కమెండోలు భద్రతగా ఉంటారు. వీళ్ళ నిర్వహణకు నెలకు అయ్యే రు. 20 లక్షల ఖర్చును అదానీయే వ్యక్తిగతంగా భరిస్తారని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ లోని చాలామంది ప్రముఖులకు ఉన్న జడ్ కేటగిరి భద్రత కేంద్రం ఉపసంహరించింది. సోనియా, రాహుల్, ప్రియాంకతో పాటు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు ఉన్న జడ్ ప్లస్ కేటగిరిగిని కేంద్రం ఉపసంహరించింది.

జడ్ కేటగిరిలో బ్లాక్ క్యాట్ కమేండోలు ఉండే పద్దతి మొదటిది అయితే సీఆర్ఫీఎఫ్ భద్రతుండేది రెండో కేటగిరి. పైన చెప్పినా కాంగ్రెస్ ప్రముఖులకు బ్లాక్ క్యాట్ భద్రతను కేంద్రప్రభుత్వం ఉపసంహరించటంపై చాలా ఆరోపణలే వచ్చాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదు.

తనకు గిట్టనివారి భద్రతను నరేంద్రమోడీ ప్రభుత్వం గాలికి వదిలేస్తోందిన కాంగ్రెస్ అగ్రనేతలు చాలా ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో మోడీకి సన్నిహితులైన వారికి జడ్ కేటగిరి భద్రత కల్పిస్తుండం మరిన్ని ఆరోపణలకు దారితీస్తోంది.