Begin typing your search above and press return to search.
భర్తలకు పంచ్ ఇస్తూ నాటి స్టార్ క్రికెటర్ ట్వీట్
By: Tupaki Desk | 25 April 2017 5:32 AM GMTమరో క్రికెటర్ ఒక ఇంటివాడు కానున్నాడు. ప్రేమించిన అమ్మాయిని మనువు ఆడనున్న ఆ క్రికెటర్ తాజాగా ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకొని మాంచి ఊపు మీద ఉన్నాడు. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్న ఆ స్టార్ క్రికెటర్ ఎవరంటే.. టీమిండియా మాజీ క్రికెటర్.. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్.
తాజాగా తన ప్రియురాలు కమ్ బాలీవుడ్ నటి సాగరిక ఘాట్గెతో జహీర్ ఎంగేజ్ మెంట్ పూర్తి అయ్యింది. తన పెళ్లి ముచ్చటను లోకానికి చెప్పే సమయాన్ని.. తన ప్రియురాలి మనసుల్ని దోచుకునే ప్రయత్నం చేశాడు. పెళ్లి తర్వాత.. భార్యలపై జోకులేసే వారందరికి పంచ్ ఇస్తూ.. తాను ఆ టైపు కాదన్నట్లుగా ట్వీట్ చేసి.. ప్రియురాలిపై తనకున్న ప్రేమ ఎంతన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు.
ఇంతకీ అంతలా చెప్పే ప్రయత్నం చేసిన ట్వీట్ ఏమంటే.. మీ భార్య ఎంపికపై నవ్వకండి.. ఎందుకంటే అందులో మీరు కూడా ఉన్నారు.. ఇక నుంచి జీవిత భాగస్వామ్యులం అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసేశాడు. ఎంగేజ్ మెంట్ పూర్తి అయిన వేళ.. ప్రతిమగాడు ఇలాంటి కలల్లోనే ఉంటాడని.. ఆ తర్వాత కదా అసలు విషయం తెలిసేదని.. జహీర్ ఖాన్ ట్విట్ ను చూసి ముసి ముసిగా నవ్వుకుంటూ కొందరు రియాక్ట్ అవుతున్నారు. తానిచ్చిన సందేశాన్ని.. పెళ్లి అయిన పదేళ్ల తర్వాత జహీర్ ఇస్తే బాగుంటుందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/