Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎంపీకి జలక్ ఇచ్చిన ఎర్రబెల్లి అల్లుడు

By:  Tupaki Desk   |   18 Oct 2019 1:04 PM GMT
టీఆర్ఎస్ ఎంపీకి జలక్ ఇచ్చిన ఎర్రబెల్లి అల్లుడు
X
టీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీకి చుక్కులు చూపిస్తున్నాడు టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి అల్లుడు. జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎంపీగా ఎన్నికల చెల్లదంటూ తాజాగా ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మదన్ మోహన్ రావు హైకోర్టులో పిటీషన్ వేశాడు. మదన్ మోహన్ రావు స్వయానా టీఆర్ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అల్లుడు కావడం విశేషం.

మొన్నటి లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో ఈ మామ-అల్లుళ్లు విడిపోయారు. మమ ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ తరుఫున నిలబడి మంత్రి కాగా.. ఆయన అల్లుడు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి ఎంపీగా జహీరాబాద్ లో రంగంలోకి దిగారు. కానీ ఓడిపోయారు. కానీ మామ ఉన్న టీఆర్ఎస్ లో చేరకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారు.

జహీరాబాద్ లో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల చెల్లదని మదన్ మోహన్ హైకోర్టులో పిటీషన్ వేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్రిమినల్ కేసులను ఎన్నికల అఫిడవిట్ లో బీబీ పాటిల్ దాచాడని.. ఆయన ఎన్నిక చెల్లదంటూ మదన్ మోహన్ పిటీషన్ లో పేర్కొన్నాడు.

ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ప్రతివాదులైన బీబీపాటిల్ తోపాటు ఈసీకి, టీఆర్ఎస్ పార్టీలకు నోటీసులు జారీ చేసి నాలుగు వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

దీంతో టీఆర్ఎస్ ఎంపీని గద్దెదించడానికి టీఆర్ఎస్ మంత్రి అల్లుడే పొగబెట్టడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అల్లుడు అల్లుడే పేకాట పేకాటే అంటే ఇదేనేమో..