Begin typing your search above and press return to search.

జకీర్ నాయక్ పై ఆ దేశంలో కూడా నిషేధం!

By:  Tupaki Desk   |   20 Aug 2019 1:43 PM GMT
జకీర్ నాయక్ పై ఆ దేశంలో కూడా నిషేధం!
X
మోడీ సర్కారు ఇండియాలో అధికారం చేపట్టగానే దేశం విడిచి పరార్ అయ్యాడు జకీర్ నాయక్. ముస్లిం మతభోధకుడిగా టీవీల్లో తరచూ కనిపించే వాడీయన. అయితే ఈయన ఉగ్రవాదాన్ని పురికొల్పుతున్నాడనే ఆరోపణలున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జకీర్ నాయక్ ఎంచక్కా ఇండియాలోనే ఉండేవాడు. అయితే మోడీ సర్కారు అధికారంలోకి రాగానే ఆయన దేశం విడిచి పరార్ అయ్యాడు. ఈయన ప్రసంగాలపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇండియాలో ఎక్కడా జకీర్ నాయక్ ఇకపై ప్రసంగిచంకుండా నిషేధాజ్ఞలున్నాయి.

ఇండియాను విడిచి పరార్ అయిన జకీర్ నాయక్ మలేసియాలో తలదాచుకున్నాడు. ఐదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడిపై ఉన్న అభియోగాలను ప్రస్తావిస్తూ తమకు అప్పగించాలని భారత్ కోరుతూ ఉంది. అయితే ఇందుకు మలేసియా ప్రభుత్వం అంత సానుకూలంగా స్పందించడం లేదు.

కానీ జకీర్ నాయక్ ప్రసంగాలను మాత్రమ మలేసియా ప్రభుత్వం నిషేధించింది. మలేసియాలో ఉన్న హిందువుల మీద, చైనీ జాతుల మీద జకీర్ నాయక్ విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్టుగా తెలుస్తోంది. ఆ విషయాన్ని గుర్తించి మలేసియన్ ప్రభుత్వం జకీర్ మీద నిషేధం విధించింది. మలేసియాలో ముస్లింలు పెద్ద ఎత్తున ఉంటారు. అలాంటి దేశంలో కూడా జకీర్ నాయక్ ప్రసంగాల మీద నిషేధం పడిందంటే ఇతడి తీరును అర్థం చేసుకోవచ్చు.