Begin typing your search above and press return to search.
దేశాన్ని విడిచేందుకు మరో వ్యాపారవేత్త రెడీనా?
By: Tupaki Desk | 30 Sept 2019 2:38 PM ISTచేతకాని పనిచేస్తే చేతులు కాలుతాయనడానికి తాజా ఉదాహరణ ప్రముఖ మీడియా కింగ్.. జీ గ్రూప్ యజమాని సుభాష్ చంద్ర. ఈయన తనకు చేతకాని రంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు జీగ్రూపుకే ఎసరు పెట్టాడు. ఇప్పుడు సుభాష్ చంద్ర కూడా అప్పుల భారంతో దేశాన్ని విడిచిపెట్టేందుకు రెడీ అయ్యాడన్న వార్త అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటికే విజయ్ మాల్యా - నీరవ్ మోడీ నుంచి చాలా మంది వ్యాపారులు బ్యాంకులకు వేల కోట్లు ముంచి వ్యాపారాలు నష్టపోయి దేశం విడిచిపారిపోయారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో బడా వ్యాపారవేత్త - మీడియా టైకూన్ కూడా దేశం విడిచి వెళ్లిపోతున్నాడనే వార్త పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతోంది.
జీ గ్రూప్ సామ్రాజ్యాన్ని విస్తరించి మీడియా టైకూన్ గా దేశంలో ఎదిగిన సుభాష్ చంద్ర తనకు సెట్ కాని మౌళిక రంగంలోకి దిగడమే ఆయనను దిగజార్చింది. జీ ఇన్ ఫ్రా పేరిట సుభాష్ చంద్ర స్థాపించిన గ్రూప్, కంపెనీ భారీగా నష్టాల పాలైంది. ఆయన ఏకంగా 12వేల కోట్ల రూపాయల నష్టం మూటగట్టుకున్నారు.
ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఇప్పటికే జీ గ్రూప్ లోని కొన్ని షేర్లు అమ్మి 5వేల కోట్లు సేకరించారు. ఇంకా 7 వేల కోట్లు సమీకరించడం కష్టంగా మారిందట.. దీంతో జీ గ్రూప్ షేర్లు స్టాక్ ఎక్స్చేంజీలో దిగజారాయట.. ఈ కంపెనీ లాస్ అని తెలిసి విదేశీ పెట్టుబడి దారులు రావడం లేదట.. ఇంటా బయటా ఒత్తిళ్లు పెరగడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఈయన దేశం దాటి పోతున్నారనే టాక్ ముంబైలో వ్యాపించింది. దీనిపై సుభాష్ చంద్ర, ఆయన కుమారుడు పునీత్ ఖండించినా ఈ పుకార్లు ఆగడం లేదు. సో మరో బడా వ్యాపారి కూడా అప్పులపాలయ్యాడన్న సంగతి ఇప్పుడు కలకలం రేపుతోంది.