Begin typing your search above and press return to search.
నాటి ప్రముఖనటికి లైంగిక వేధింపులు
By: Tupaki Desk | 30 Jan 2018 6:11 AM GMTఇంతకు మించిన సిగ్గుమాలిన విషయం మరింకేం ఉంటుంది. 66ఏళ్ల వయసులో ఉన్న అలనాటి ప్రముఖ నటిపై ఒక పారిశ్రామికవేత్త అసభ్యంగా ప్రవర్తించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. బాలీవుడ్ వెటరన్ నటి.. తన అందంతో రెండు మూడుతరాలను ఒక ఊపు ఊపేసిన ఆమెకు ఇప్పుడు లైంగిక చిక్కులు ఎదురయ్యాయి. ఆమె ఎవరంటే బాలీవుడ్ వెటరన్ నటి జీనత్ అమన్.
1970 ఫెమినా మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ విజేత అయిన జీనత్.. తర్వాతి కాలంలో పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. అందాల ఆరబోతలో ఆమెకు పేరుంది. అందాల ప్రదర్శనతో పాటు.. నటిగా ఆమెకు మంచి పేరుంది. 1985లో మజార్ ఖాన్ ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. 2998లో మజూర్ మరణించారు. ప్రస్తుతం కొడుకులతో కలిసి మంబయిలోని జూహులో నివసిస్తున్నారు జీనత్. సినిమా ఫంక్షన్లలో సందడి చేస్తుంటారు. ఇప్పటికి ఉత్సాహంగా ఉండే ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. 66 ఏళ్ల ఆమెను ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్త వేధింపులకు గురి చేస్తున్న వైనాన్ని ఆమె పోలీసులకు వెల్లడించారు. దీంతో.. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జీనత్ అమన్ కుటుంబానికి బాగా దగ్గరైన వ్యక్తే ఈ దారుణానికి పాల్పడటం.
ముంబయికి చెందిన వ్యాపారవేత్త అమర్ ఖాన్ జీ కుటుంబానికి జీనత్ అమన్ కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మంచి స్నేహితులుగా అందరికి సుపరిచితం. ఇదిలా ఉంటే.. కొద్ది కాలం క్రితం ఆర్థిక లావాదేవాల కారణంగా గొడవలు జరిగాయి. దీంతో.. ఈ రెండు కుటుంబాల మధ్య మాటల్లేవు. ఇదిలా ఉంటే.. కొన్ని నెలలుగా అమర్ మళ్లీ జీనత్ అమన్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఒకసారి కలుద్దామన్న మాట చెప్పాడు.
అందుకు జీనత్ ఓకే అన్నారు. ఇందులో భాగంగా తన ఇంటికి రావాలని అమర్ ఆహ్వానించారు. ఆయన ఇంటికి వెళ్లిన జీనత్‌కు ఊహించని షాక్ తగిలింది. సెక్యూరిటీ గార్డు సాయంతో అమర్ తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆమె చెప్పారు.
తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు జీనత్. ముంబయి డీసీపీ పరమజీత్ సింగ్ దహియా ఈ కేసు ఉదంతాన్ని వెల్లడించారు. నిందితుడి కోసంపోలీసులు గాలిస్తున్నట్లు చెప్పారు.