Begin typing your search above and press return to search.

పుతిన్ బతికే ఉన్నాడా? అంటూ ప్రశ్నించిన జెలెన్ స్కీ..!

By:  Tupaki Desk   |   21 Jan 2023 11:40 AM GMT
పుతిన్ బతికే ఉన్నాడా? అంటూ ప్రశ్నించిన జెలెన్ స్కీ..!
X
రష్యా-ఉక్రెయిన్ వరకు సుమారు 10 నెలలుగా ఎడతెరిపి లేకుండా కొనసాగుతోంది. ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయత్నించడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ దేశంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022 ఫిబ్రవరిలో మొదలైన యుద్ధం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలోనే ఇరు దేశాలకు చెందిన వేలాది సైనికులు.. అమాయక ప్రజలు మృత్యువాత పడుతుండటం శోచనీయంగా మారింది.

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని నివారించడానికి ఐక్య రాజ్య సమితి చేసిన ప్రయత్నాలేవి కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. ఉక్రెయిన్ కు అమెరికా సహా నాటో దళాలు పరోక్షంగా యుద్ధంలో సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ సైతం రష్యాకు ధీటుగా ప్రతి దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కన్పించడం లేదు.

ఈక్రమంలోనే ఇటీవల దావోస్ లో ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడారు. శాంతి చర్చలు ఎప్పుడు ప్రారంభం అవుతాయని జెలెన్ స్కీకి ప్రశ్నలు ఎదురయ్యారు. ఈ నేపథ్యంలోనే నాకు పుతిన్ బ్రతికే ఉన్నారనే విషయం తెలియదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పుతిన్ ఉనికిలో ఉండేందుకు ఇష్టపడరని ఆయన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

శాంతికి వ్యతిరేకంగా కనిపించే వారితో శాంతి చర్చలు ఎలా జరుపుతారో అర్థం కావడం లేదన్నారు. రష్యాలో ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారో లేదా అక్కడ ఇంకేవరైనా ఆయన స్థానంలో నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదని విమర్శలు గుప్పించారు. మీరంతా యూరోపియన్ నాయకులకు శాంతి చర్చలపై ఎలా వాగ్దానం చేస్తారో తనకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు.

పుతిన్ శాంతి అంటూనే ఆ తర్వాతి రోజు పూర్తి స్థాయి దళాలతో తమపై దాడులు చేస్తారన్నారు. అందువల్ల తాము ఎవరితో శాంతి చర్చలు జరుపాలో తనకు అర్థం కావడం లేదని రష్యాకు జెలెన్ స్కీ కౌంటరిచ్చాడు. జెలెన్ స్కీ వ్యాఖ్యలను క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఖండించారు. దీనిని బట్టి రష్యా.. పుతిన్.. ఉక్రెయిన్.. జెలెన్ స్కీ ఒక పెద్ద సమస్యగా తెలుస్తోందన్నారు. జెలెన్ స్కీ మానసికంగా రష్యా లేదా పుతిన్ ఉనికిలో ఉండకుండా ఉండేందుకు ఇష్టపడుతున్నారని ఆరోపించారు.

రష్యా మరియు తమ అధ్యక్షుడు పుతిన్ ఉనికిలోనే ఉంటారని అదే ఉక్రెయిన్ కు సైతం మంచిదని ఆయన కౌంటర్ ఇచ్చాడు. వీరిద్దరు మాటలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. కాగా పుతిన్ ఇటీవలి కాలంలో పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉంటుండటంతోనే జెలెన్ స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.