Begin typing your search above and press return to search.
వార్ వేళ.. భార్యతో కలిసి అధ్యక్షుల వారి ఫోటో షూట్!
By: Tupaki Desk | 28 July 2022 3:57 AM GMTమీరు చదివింది నిజమే. ఓవైపు యుద్ధంతో లక్షలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుజీవుడా అని రోజులు వెళ్లదీస్తున్న పరిస్థితి. మరోవైపు.. ఇందుకు భిన్నంగా దేశాధ్యక్షుడు తన సతీమణితో కలిసి ఒక ప్రముఖ మ్యాగ్ జైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొనటం ఇప్పుడు సంచలనంగా మారింది. తన పక్కనే ఉన్న ఉక్రెయిన్ మీద యుద్ధం చేసి.. ఆ దేశాన్ని కబళించాలని రష్యా అధినేత వాద్లిమర్ పుతిన్ భావించటం.. తాము డిసైడ్ అయితే.. రోజుల వ్యవధిలో ఉక్రెయిన్ ను కబళించేయొచ్చన్న అంచనాతో బరిలోకి దిగిన పుతిన్ కు నెలల తరబడి సాగుతున్న యుద్దంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి.
మరోవైపు.. సినీ కమెడియన్ గా సుపరిచితుడైన జెలెన్ స్కీ .. దురాక్రమణే లక్ష్యంగా రష్యా చేస్తున్న యుద్ధానికి ఎదురొడ్డి.. చేస్తున్న పోరాటం.. ఆయన తెగువ.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు మరింత మంది అభిమానుల్ని చేసింది. రష్యా యుద్ధం చేస్తున్న వేళ.. దేశ ప్రజలకు అండగా అతగాడు నిలిచిన వైనం.. అతడి ఎత్తులు.. ఉక్రెయిన్ కు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి తెలిసిందే. యుద్ధం ఆరంభమైన వేళ.. తానిక సజీవంగా ఉంటానో? లేనో? అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేసి.. అమెరికా తదితర దేశాల సాయం కోసం అర్థించిన వైనం తెలిసిందే.
అలా ప్రాధేయపడిన ఆయన.. ఆ తర్వాతి కాలంలో రష్యాకు ఒక పట్టాన మింగుడుపడని రీతిలో దెబ్బేస్తూ.. యుద్ధానికి ఎందుకు దిగాం? అన్న భావన కలిగేలా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. ఆయన చర్య ఒకటి ఇప్పుడు సంచలనంగా మారింది. యుద్ధం నుంచి దేశ ప్రజల్ని కాపాడేందుకు ఆయన తీసుకున్న నిర్ణయాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమైన వేళ.. ఎందుకు తీసుకున్నారో కానీ.. ఒక ప్రముఖ మ్యాగ్ జైన్ కవర్ పేజీ కోసం తన భార్యతో ఫోటో షూట్ కు ఓకే చెప్పటం.. అది కాస్తా ఇప్పుడుపబ్లిష్ అయి.. పెను దుమారాన్ని రేపుతోంది.
సతీమణి ఒలెనా జెలెన్ స్కాతో కలిసి ఉక్రెయిన్ అధినేత దిగిన ఫోటోలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. యుద్ధం వేళ.. భార్యతో కలిసి ఫోటో షూట్ లో పాల్గొనటమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఉక్రెయిన్ అధ్యక్షుల వారు ఫోటో షూట్ చేసింది వోగ్ మ్యాగ్ జైన్ కోసం. పనిలో పనిగా ప్రత్యేక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అధ్యక్ష భవనంలో వీరిద్దరూ చేతిలో చేయి వేసుకొని ఇచ్చిన ఫోజులు.. మరికొన్ని ఫోటోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఈ ఫోటో షూట్ మీద ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఈ ఫోటో షూట్ మీద ఉక్రెయిన్ అధ్యక్షుడు.. ఆయన సతీమణి వాదనలు మాత్రం వేరుగా ఉన్నాయి. ఉక్రెయిన్ లో తాజా పరిస్థితుల్ని ప్రపంచానికి తెలియజేయాలనే తామీ పని చేసినట్లుగా చెబుతున్నారు. తాము పాల్గొన్న ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోల్ని ఒలెనా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఫోటో షూట్ లో భాగంగా భర్తతో పాటు.. యుద్ధ ట్యాంకులు.. సైనికులతో కలిసి ఆమె ఫోటోలు దిగటం గమనార్హం.
వోగ్ కవర్ పేజీపై ఫోటో రావటం గొప్ప గౌరవమని.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు.. విజేతలు కనే కలగా ఆమె అభివర్ణించారు. వారి కలను నెరవేర్చాలని తాను అనుకుంటున్నట్లుగాపేర్కొన్నారు. ఉక్రెయిన్ లోని ప్రతి మహిళ కూడా తన మాదిరి.. కవర్ పేజీలో ఉండాలని తాను కోరుకుంటున్నట్లుగా వెల్లడించారు. సైరన్ల మోతలో.. శిబిరాల్లో శరణార్థులుగా దీనమైన స్థితిలో బతుకుతున్న ప్రతి మహిళకు కవర్ పేజీ మీద ఉండే హక్కు ఉందన్నది ఆమె వాదన. ఈ ఫోటో షూట్ పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండగా.. కొందరు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు. దేశంపై రష్యా బాంబులు వేస్తున్న వేళలో.. జెలెన్ స్కీ ఇలాంటి ఫోటో షూట్లలో పాల్గొనటమా? అని పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా వార్ వేళ.. ఉక్రెయిన్ అధ్యక్షుల వారి ఫోటో షూట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.