Begin typing your search above and press return to search.

కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు

By:  Tupaki Desk   |   29 Nov 2021 2:30 PM GMT
కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు
X
కరోనా పాజిటివ్ అని తేలితే.. ఆ వెంటనే సదరు వ్యక్తికి చెందిన ఇంటిని శానిటైజ్ చేయటం.. అతడున్న పరిసరాల్ని శానిటైజ్ చేసి.. ఆ చుట్టుపక్కల వారికి పరీక్షలు నిర్వహించటం.. ఆ ప్రాంతంలో రాకపోకల్ని నియంత్రించటం.. లాంటి హడావుడి ఎంతో జరిగేది. కొవిడ్ సోకిన వారికి దగ్గరగా వారి కుటుంబ సభ్యుల్ని రానివ్వకుండా ఆసుపత్రిలో చేర్పించటం.. ఇలా ఎంతో జరిగేది. కొవిడ్ మొదట్లో ఉన్న పరిస్థితులకు ఇప్పటికి మధ్య చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి.

గతంలో మాదిరి కాకుండా కొవిడ్ సోకినప్పటికీ ఇంట్లో ఉండిపోవటం.. అవసరానికి అనుగుణంగా ఆసుపత్రికి సొంతంగా కారులో డ్రైవ్ చేసుకొని తిరిగి రావటం లాంటివి ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిన ఒక దేశాధ్యక్షుడు తన అధ్యక్ష పదవికి ప్రమాణస్వీకారం చేయటం కోసం స్వయంగా వచ్చిన వైనం ఆశ్చర్యానికి గురి చేసేలా మారింది. అంతేకాదు.. ఆయన ప్రమాణస్వీకారోత్సవ సందర్భంగా వినూత్న ఏర్పాట్లు చేశారు.

ఇదంతా ఎవరి విషయంలో జరిగిందంటే.. చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమన్ ఇలాంటి పనే చేశారు. ప్రస్తుతం ఆయన కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. అయితే.. ఆయన దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతల్ని చేపట్టాలి. ఇందుకోసం రోటీన్ కు భిన్నంగా ఆయన ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. అక్టోబరులో జరిగిన ఎన్నికల్లో సెంటర్.. సెంటర్ రైట్ ప్రతిపక్షాలు సమిష్టిగా విజయం సాధించాయి. దీనికి పీటర్ నాయకత్వం వహిస్తున్నారు. తాజాగా ఆ దేశంలో కరోనా కేసులు ఎక్కువ అయిపోయాయి.

ఆరు వారాల క్రితం గుర్తు తెలియని ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనకు.. అదే క్రమంలో ఆయన కొవిడ్ బారిన పడ్డారని చెబుతారు. ప్రధాని నియామక కార్యక్రమానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న జెమన్ హాజరయ్యారు. పీఈపీ కిట్ ధరించిన వైద్య సిబ్బంది ఆయన్ను వేదిక మీదకు వీల్ చైర్ లో తీసుకొచ్చారు. ప్రమాణ స్వీకారం జరుగుతున్న గదిలో ప్రత్యేకమైన గాజుని ఏర్పాటు చేసి.. అందులో ఉండి ప్రమాణస్వీకారోత్సవాన్ని ఆయన పర్యవేక్షించారు.

ప్రస్తుతం చెక్ రిపబ్లిక్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. దీనికి కారణం ఆ దేశంలో వ్యాక్సినేషన్ అనుకున్నంత స్థాయిలో జరగకపోవటమే. ప్రస్తుతం తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో చిక్కుకున్న ఆ దేశానికి కొవిడ్ కేసుల తీవ్రత మరింత ఇబ్బంది పెడుతోంది. ఇలాంటి వేళ.. ప్రమాణస్వీకారోత్సవానికి కొవిడ్ పాజిటివ్ అయిన దేశాధ్యక్షుల వారు పాల్గొనటం ఆసక్తికరంగా మారింది.