Begin typing your search above and press return to search.

వ్యాక్సినేషన్ తో జీరోస్థాయికి కరోనా మరణాలు

By:  Tupaki Desk   |   7 Jun 2021 10:30 AM GMT
వ్యాక్సినేషన్ తో జీరోస్థాయికి కరోనా మరణాలు
X
కరోనాకు మందు లేదు.. నివారణ అంతకంటే లేదు. దీంతో ముందస్తుగా వ్యాక్సిన్లు వేసి నయం చేయడమే దిక్కు. అందుకే అమెరికా, యూరప్ సహా పాశ్చాత్య దేశాలు అన్ని ముందస్తుగా వ్యాక్సిన్లు కొనుగోలు చేసి ఇప్పుడు ఆ దేశ ప్రజలకు ఇస్తూ కరోనాను పూర్తి స్థాయిలో తగ్గించగలుగుతున్నాయి.

కరోనా వ్యాక్సినేషన్ ను పెద్ద ఎత్తున చేస్తున్న యునైటెడ్ కింగ్ డమ్ (యూకే దేశం) ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. యూకే పరిధిలో ఇప్పుడు కరోనా మరణాలు జీరో స్థాయికి చేరాయి. రెండు రోజుల కిందట మొత్తం యూకే పరిధిలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

మొదటి కరోనా వేవ్ లో కరోనాతో యూకే తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ ఏడాది జనవరిలో యూకే కరోనాతో అల్లకల్లోలమైంది. భారీ స్థాయిలో కేసులు.. ప్రపంచంలోనే అత్యధిక మరణాలతో యూకేలో మరణ మృదంగం వినిపించింది.

అలాంటి చోట అక్కడి ప్రభుత్వం పకడ్బందీ చర్యలతో ఇప్పుడు పూర్తి స్థాయిలో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది. ప్రభుత్వం ముందస్తుగా కరోనా టీకాలు కొని వేయడంతో ఇప్పుడు రోజువారీ మరణాల సంఖ్య జీరో స్థాయికి వచ్చింది. ఇది ఆ దేశంలో ఊరటనిచ్చే అంశంగా మారింది.

గత వారంలో యూకే పరిధిలో రోజుకు పదిలోపు స్థాయిలో మాత్రమే కరోనా మరణాలు నమోదయ్యాయి. రోజువారీగా కేసుల సంఖ్య రెండు మూడు వేల స్థాయిలో నమోదవుతున్నా మరణాలు మాత్రం బాగా తగ్గడం గొప్ప ఊరటగా చెప్పొచ్చు. దీనికి కారణం అక్కడ ప్రజలకు పెద్ద సంఖ్యలో వ్యాక్సిన్లు వేయడమే.

వ్యాక్సినేషన్ ప్రజలందరికీ వేయడమే కరోనా మరణాలు తగ్గడానికి కారణమని.. కరోనాపై తమ ప్రభుత్వం విజయం సాధించిందని యూకే నేతలు చెబుతున్నారు. యూకేలో ఇప్పటికే 75శాతం జనాభాకు ఒక డోసు కరోనా వ్యాక్సినేషన్ వేసేశారు. వారిలో దాదాపు 60శాతం మందికి రెండో డోసు కూడా వేశారు. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం బాగా తగ్గిందని అక్కడి ప్రభుత్వం ధ్రువీకరిస్తోంది.