Begin typing your search above and press return to search.

ఆశ్చ‌ర్యం..క‌రోనా సోక‌ని దేశాలు ఇవే..!

By:  Tupaki Desk   |   15 April 2020 12:30 AM GMT
ఆశ్చ‌ర్యం..క‌రోనా సోక‌ని దేశాలు ఇవే..!
X
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది. ఏడు ఖండాల‌కు ఈ వైర‌స్ పాకింది. అగ్ర దేశాల‌తో పాటు అట్ట‌డుగున ఉన్న దేశాల‌కు కూడా ఆ వైర‌స్ క‌ల‌వ‌రం సృష్టిస్తోంది. ప్ర‌పంచ‌మంతా ఆ వైర‌స్ అంత క‌ల్లోలం సృష్టిస్తుండ‌గా ఇలాంటి స‌మ‌యంలో కూడా కొన్ని దేశాల్లో క‌రోనా వైర‌స్ వ్యాపించ‌లేదంట‌. ఆ దేశాల‌కు ఇంకా క‌రోనా వైర‌స్ ప్ర‌వేశించ‌లేక‌పోవ‌డ ఆశ్చ‌ర్యం. అలాంటి దేశాలు దాదాపు 15 దాక ఉన్నాయి.

ఇప్పుడు క‌రోనాతో ప్ర‌పంచమంతా అత‌లాకుత‌లమై అంత‌ర్జాతీయంతో పాటు ఆయా దేశాలు ఆర్థికంగా కుదేల‌వుతున్నాయి. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డుతున్నారు. ఈ మ‌హ‌మ్మ‌రి ఇప్ప‌టివ‌ర‌కు అన్నీ దేశాల్లో వ్యాపించింద‌ని అనుకున్నాం. కానీ కొన్ని దేశాల‌కు మాత్రం పాక‌క‌పోవ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యం. ఈ విష‌యాన్ని కరోనా వైరస్ రిసోర్స్ సెంటర్‌ కు చెందిన జాన్ హాప్‌ కిన్స్ యూనివర్శిటీ త‌న వెబ్‌ సైబ్‌ లో వెల్ల‌డించింది. ఆయా దేశాల్లో ఇప్పటివరకు ఒక్క క‌రోనా వైర‌స్ కేసు కూడా నమోదు కాలేదని తెల‌ప‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అలాంటి దేశాలేవో.. మీరే చ‌ద‌వండి.

1. కొమొరోస్ 2. లెసోతో 3. మార్షల్ దీవులు 4. పలావు 5. నౌరు 6. సమోవ 7.కిరిబాటి 8. వనౌటు 9. సోలమన్ దీవులు 10. టోన్గా 11. టువాలు 12. తుర్క్మెనిస్తాన్ 13. తజికిస్తాన్.

ఈ దేశాల్లో ఒక్క క‌రోనా వైర‌స్ కేసు కూడా న‌మోదు కాని దేశాలు ఉన్నాయి. అయితే వాటి దేశాల పేర్లు ఎప్పుడు విన‌ని ఉండ‌ని వారు చాలామంది ఉంటారు. త‌మ దేశంలో ఒక్క క‌రోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేద‌ని ఉత్త‌ర కొరియా ప్ర‌క‌టిస్తోంది. అయితే ఆ దేశం మాట‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. క‌రోనా కేసులు న‌మోదైనా ర‌హాస్యంగా ఉంచి త‌మ దేశంలో క‌రోనా పాక‌లేద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు కిమ్ ప్ర‌క‌టిస్తున్నాడు. అయితే అలాంటిదేమీ లేద‌ని.. చైనా ప‌క్క‌న ఉన్న ఆ దేశంలో త‌ప్ప‌నిస‌రిగా కేసులు న‌మోద‌య్యాయ‌ని కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా ప్ర‌క‌టించ‌డం లేద‌ని అంత‌ర్జాతీయ సంస్థ‌లు, విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏదైతే ఏముంది భూగోళంలో కొన్ని దేశాల‌కు క‌రోనా పాక‌లేద‌ని తెలియ‌డం అంద‌రూ హ‌ర్షిస్తున్నారు.