Begin typing your search above and press return to search.
ట్రంప్ ను మించిన వైఎస్సార్సీపీ నాయకులు
By: Tupaki Desk | 15 April 2020 8:50 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలుతోంది. ఈక్రమంలో కరోనా కట్టడికి నివారణ చర్యలు తీసుకోవాలి. ఈ సందర్భంగా మన వద్ద ఉన్న ప్రధాన ఆయుధం లాక్ డౌనే. సామూహిక కార్యక్రమాలు - ప్రజల రాకపోకలను నియంత్రిస్తే కరోనాను నియంత్రించినట్టే. ఈ విషయాన్ని గుర్తెరిగిన చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే అగ్రరాజ్యం అమెరికా మాత్రం ఆర్థిక వ్యవస్థే ముఖ్యమని పేర్కొంటూ లాక్ డౌన్ ప్రకటించలేదు. అదే ఆ దేశ అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ చేసిన ప్రధాన తప్పు. ఆ తప్పునకు ఇప్పుడు ఆ దేశం భారీగా మూల్యం చెల్లించుకుంటోంది. ఫలితంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఆ దేశంలో ఏర్పడిన విషయం తెలిసిందే. సేమ్ ఇదే మాదిరి ట్రంప్ వ్యవహరించినట్టు ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు - సోషల్ మీడియా లో వున్న కొందరు వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ ఏప్రిల్ 14వ తేదీతో ముగిసింది. అయినా దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో మరోసారి లాక్ డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే దీనిపై సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తే దేశ - రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర నష్టాల బారిన పడతాయని కొన్ని వర్గాలు సూచించగా వాటిని పట్టించుకోకుండానే భారత ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించారు. ఇక్కడితో ఆ చర్చకు తావు లేదని అందరూ భావించారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియాలో ఇంకా లాక్ డౌన్ అంశంపై చర్చ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో పలు పోస్టులు చేస్తూ లాక్ డౌన్ పొడగింపుతో రాష్ట్రంతో పాటు దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీలోని సోషల్ మీడియాలో ఉన్న కొంత మంది లాక్ డౌన్ పొడిగించడంతో తీవ్ర నష్టాలు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. లాక్ డౌన్ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఆ సబ్జెక్ట్ పై అవగాహన లేని వారు కూడా పోస్టులు పెడుతుండడం గమనార్హం. రూపాయి సంపాదించలేని వ్యక్తులు కూడా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడేస్తున్నారు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా జియో బ్యాలెన్స్ వేసుకుని ఇంట్లో.. గ్రామంలోని అరుగుల మీద కూర్చొని తెగ పోస్టులు పెడుతున్నారు. తమను తాము మేధావులుగా భావించుకుంటూ సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ పేరు మీదుగా పోస్టులు చేస్తుండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిణమించే అవకాశం ఉంది. వారిని కట్టడి చేయకపోతే ప్రభుత్వంపై విమర్శలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఆ పార్టీ నాయకులు వారిని గుర్తించి చర్యలు తీసుకోకపోతే పరిణామాలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.