Begin typing your search above and press return to search.
కేరళలో కలకలం.. జికా వైరస్ కేసు నమోదు !
By: Tupaki Desk | 9 July 2021 6:39 AM GMTకేరళలో కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక రోజువారీ కేసులు కేరళ రాష్ట్రంలోనే నమోదు అవుతున్నాయి. కాగా, కేరళలో తాజాగా జికా వైరస్ కేసు నమోదుకావడం కలకలం రేగుతోంది. జికా వైరస్ కేసులు నమోదయినట్టు కేరళ అధికారికంగా ప్రకటించింది. తిరువనంతపురం జిల్లాలో 13 జికా వైరస్ కేసులు నమోదయినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది.పుణెలోని నేషనల్ వైరాలజీ ల్యాబ్‌కు 19 శాంపిళ్లను పంపించగా.. 13 మందికి పాజిటివ్‌గా అనుమానిస్తున్నామని ఓ అధికారివెల్లడించారు.
మొదట 24 ఏళ్ల గర్భిణిలో ఈ వైరస్ వెలుగు చూసింది. జులై 7న ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వగా.. శిశువులో వైరస్ లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండ్ల కలక, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, అనారోగ్యం వంటివి జికా వైరస్ లక్షణాలు. ఈ వైరస్ ఎడిస్ ఎనాఫిలస్ అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ రకం దోమలు కేరళలో చాలా పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. ఇవి డెంగ్యూ, చికున్ గన్యాల వ్యాధులకు వాహకాలుగా పనిచేసే ఈ జాతి దోమలు నిలకడగా ఉన్న మంచినీళ్లు, ఎక్కువగా ఇంటి లోపల ఉంటాయి. జికా వైరస్ పుట్టుకతో వచ్చే లోపాలు, గుల్లెయిన్-బారే సిండ్రోమ్ అభివృద్ధికి కారణమవుతుంది.రోగనిరోధక వ్యవస్థ, నరాలపై ఈ వైరస్ దాడి చేస్తుంది. అయితే, ఈ వైరస్ సోకిన కొంత మందికి సంకేతాలు లేదా లక్షణాలను బయటపడకపోవచ్చు.
అయినప్పటికీ, గర్భిణీలలో సంక్రమణ అభివృద్ధి చెందుతున్న పిండానికి తీవ్రంగా హాని కలిగిస్తుందని చెప్తున్నారు. అలాగ ఈ జిక వైరస్ పుట్టుకతో వచ్చే అవయవలోపాలకు దారి తీసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ వైరస్ కు ఎటువంటి టీకా లేదా నివారణ లేదు. ఈ జిక వైరస్ ను మొదటగా 1947లో ఆఫ్రికాలోని ఉగాండలో గుర్తించారు. 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో అహ్మదాబాద్, తమిళనాడులో ఈ కేసులు వెలుగుచూశాయి. జికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ను కలిస్తే మంచింది.