Begin typing your search above and press return to search.

రష్యా చేతిలో జిర్కాన్ మిసైల్

By:  Tupaki Desk   |   29 May 2022 2:30 PM GMT
రష్యా చేతిలో జిర్కాన్ మిసైల్
X
ఒకవైపు ఉక్రెయిన్ తో మూడు నెలలుగా యుద్ధం చేస్తున్న రష్యా తాజాగా జిర్కాన్ మిసైల్ ను ప్రయోగించింది. జిర్కాన్ మిసైల్ ప్రయోగం విజయవంతమవటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఒకవైపు యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా కొత్త క్షిపణులను ప్రయోగిస్తుందని ప్రపంచ దేశాలు ఏమాత్రం ఊహించలేదు.

మిసైల్ ప్రయోగించిన విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా పసిగట్టేంతలోపే క్షిపణిని పరీక్షించటం, విజయవంతంగా ముగిసిపోవటం అయిపోయింది.

తాజాగా ప్రయోగించిన మిసైల్ ధ్వనివేగం కన్నా 9 రెట్లు వేగంతో దూసుకెళ్ళే అత్యంత శక్తివంతమైన జిర్కాన్ హైపర్ సోనిక్ క్రూజ్ క్షిపణిగా రికార్డు నమోదు చేసింది. ధ్వని కన్నా 9 రెట్ల వేగమంటే గంటకు 11 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదని నిపుణులు లెక్కలు తేల్చారు. హైపర్ సోనిక్ పరిజ్ఞానంలో రష్యా ప్రయోగించిన తాజా మిసైలే అత్యంత శక్తవంతమైనదిగా నిపుణులు అంగీకరించారు.

బేరంట్స్ సముద్రంలో అడ్మిరల్ గోర్ష్ ఖోవ్ యుద్ధనౌక నుండి జిర్కాన్ మిసైల్ ను ప్రయోగించింది రష్యా. తాజా మిసైల్ వేగం, దీనికి ప్రత్యేకంగా అమర్చిన స్టెల్త్ పరిజ్ఞానం కారణంగా జిర్కాన్ కు ప్రత్యేకత సంతరించుకున్నది.

జిర్కాన్ మిసైల్ ను శతృదేశాల రాడార్లు కూడా గుర్తించలేవని రష్యా సైన్యాధికారులు ప్రకటించారు. జిర్కాన్ మిసైల్ ముందుభాగంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఏర్పాటు, పరిజ్ఞానం వల్ల మిసైల్ ఆర్టిఫిషియల్ మేఘాలను సృష్టించుకుంటుంది. దాంతో శతృదేశాల రాడార్లు కూడా గుర్తించలేవన్నారు.

అమెరికా దగ్గర అణుశక్తితో నడిచే 11 విమాన వాహక నౌకలున్నాయి. సైజులోనే కాకుండా సాంకేతిక పరిజ్ఞానంలో కూడా ఇవి అత్యంత శక్తివంతమైనవి. పెద్ద సంఖ్యలో యుద్ధ విమానాలను మోసుకెళ్ళే మొబైల్ వైమానిక స్ధావరాల్లా పనిచేస్తాయి. ఇపుడు జిర్కాన్ మిసైల్ ప్రయోగంతో అమెరికా విమానవాహక నౌకలకు రష్యా ఛాలెంజ్ విసిరినట్లయ్యింది.

అగ్రరాజ్యాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు రష్యా సూపర్ సోనిక్, హైపర్ సోనిక్ క్రూప్ మిసైల్స్ ను తయారుచేస్తోందనటంలో సందేహం లేదు. కాకపోతే ఇపుడు జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ పై తాజా క్షిపణిని ప్రయోగించే అవకాశాలు దాదాపు లేదనే చెప్పాలి.