Begin typing your search above and press return to search.

ఉబ‌ర్ ఈట్స్ అమ్ముడుపోయింది...కానీ ఈ షాకేంటి?

By:  Tupaki Desk   |   21 Jan 2020 4:55 PM GMT
ఉబ‌ర్ ఈట్స్ అమ్ముడుపోయింది...కానీ ఈ షాకేంటి?
X
అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉబర్ సంస్థ త‌న వ్యాపార విస్త‌ర‌ణ‌లో భాగంగా ఊబ‌ర్ ఈట్స్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఉబర్‌ ఈట్స్‌’ పేరుతో భారత్‌లో ఆహారాన్ని డెలివరీ చేస్తోన్న ఈ కంపెనీని ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కొనుగోలు చేసింది. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించ‌డంలో భాగంగా జొమాటో ఈ కొనుగోలు చేయ‌గా... అంతర్జాతీయంగా తమ సంస్థకు నష్టాలను తెస్తున్న వ్యాపార విభాగాలను తగ్గించుకోవడంలో భాగంగానే తమ వ్యాపారాన్ని విక్రయించినట్లు ఉబర్‌ తెలిపింది. జొమాటో, ఉబర్‌ ఈట్స్‌ 2,485 కోట్ల విలువైన వ్యాపార ఒప్పందం చేసుకున్నాయి. అయితే, త‌మ‌కు మాత్రం ఈ నిర్ణ‌యం షాకింగ్ వంటిద‌ని ఉబ‌ర్ వినియోగ‌దారులు వాపోతున్నారు.

ఉబర్‌ ఈట్స్ 2017లో ఫుడ్‌డెలివరీ వ్యాపారాన్ని ప్రారంభించింది. భారత్‌లో అగ్రశ్రేణి ఫుడ్‌డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీల నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో నిలదొక్కుకోవడంలో విఫలమైంది. అయితే, ఇన్నాళ్లు సేవ‌లు అందించిన స‌మ‌యంలో, ఇప్పటి వరకు కొంద‌రు క‌స్ట‌మ‌ర్ల వ‌ద్ద ఊబ‌ర్ ఈట్స్ కూప‌న్లు ఉన్నాయి. తాజా డీల్‌తో ఇలా కూప‌న్లు ఉన్న ఉబెర్ ఈట్స్ ఫాన్స్ కలవరపాటుకు లోనవుతున్నారు. తాము పోగేసుకున్న కూపన్ల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తుండ‌గా... ఎలాంటి ఆందోళన అవసరం లేదని, కస్టమర్లు తమ కూపన్లను కోల్పోరని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

కాగా, ఒప్పందం మేరకు జొమాటోలో ఉబర్‌ ఈట్స్‌ విలీనమైంది. ఈ మేరకు జోమాటోలో ఉబర్‌కు 10 శాతం వాటాను ఇవ్వనున్నారు. జొమాటో కంపెనీలో ఉబర్‌ విలీనం కావడంతో ఇక నుంచి ఉబర్‌ ఈట్స్‌ సేవలన్నీ భారత్‌లో నిలిచిపోతాయి. వినియోగదారులు ఉబర్‌ ఈట్స్‌ యాప్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసినప్పటికీ.. ఆటోమేటిక్‌గా ఆర్డర్లు అన్నీ జొమాటో ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానం చేయబడతాయి.