Begin typing your search above and press return to search.

డియ‌ర్ ఫుడీస్‌... జొమాటో హ్యాక‌యింది

By:  Tupaki Desk   |   18 May 2017 9:46 AM GMT
డియ‌ర్ ఫుడీస్‌... జొమాటో హ్యాక‌యింది
X
ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ అటాక్స్ ఇండియాలో బిగ్గెస్ట్ ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ సర్వీస్ జొమాటో పైనా పడగ విప్పాయి. అయితే... ఈ దాడిలో ఏ ఒక్క యూజర్ కు చెందిన ఆన్ లైన్ పేమెంట్ డాటాను కూడా హ్యాకర్లు దొంగిలించలేకపోయారు. దీంతో తమ యూజర్ల క్రెడిట్ - డెబిట్ కార్డుల డాటా ఏమాత్రం లీకవలేదని జొమాటో ప్రకటించింది.

అయితే, జొమాటో డాటాబేస్ లోని 1.7 కోట్ల మంది వినియోగదారులకు చెందిన యూజర్ నేమ్స్- హ్యాష్డ్ పాస్ వర్డ్డ్స్ ను మాత్రం హ్యాకర్లు చోరీ చేయగలిగారు. గురువారం జరిగిన ఈ దాడి ఫలితంగా కంపెనీ వెంటనే స్పందించి ఎఫెక్టయిన యూజర్ల అందరి పాస్ వర్డ్ లను రీసెట్ చేయించింది. ఎన్ క్లే అనే డార్క్ వెబ్ ఈ దాడికి బాధ్యత వహించింది. అయితే... ఈ దొంగిలించిన యూజర్ నేమ్స్ - పాస్ వర్డ్ లను సుమారు వెయ్యి డాలర్లకు హ్యాకర్లు అమ్ముకునే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్లు ఎకనమిక్ టైమ్స్ పేర్కొంది.

తాజా దాడి నేపథ్యంలో జొమాటో స్పందిస్తూ... ఒకట్రెండు రోజుల్లో తమ వెబ్ సైట్ - యాప్ లను మరింత సురక్షితంగా మార్చేలా సెక్యూరిటీ వ్యవస్థను డెవలప్ చేయనున్నట్లు తెలిపింది. సెక్యూరిటీ పరంగా మరో ఆథరైజేషన్ లేయర్ యాడ్ చేసి డాటా బ్రీచ్ కు ఏమాత్రం అవకాశం లేకుండా చేస్తామని వెల్లడించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/