Begin typing your search above and press return to search.

అమరావతిలో జూ?

By:  Tupaki Desk   |   20 July 2015 1:45 PM GMT
అమరావతిలో జూ?
X
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలో ఒక జంతు ప్రదర్శన శాల (జూ)ను కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా? అటవీ శాఖకు చెందిన భూమిలో దీనిని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందా? ఏకంగా 15 వేల ఎకరాల స్థలంలో జూ ఏర్పాటుకు కేంద్రం నుంచి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందా? ఈ ప్రశ్నలు అన్నిటికీ ఔను అనే జవాబిస్తున్నాయి అధికార వర్గాలు.

నగర వన ఉద్యాన వన యోజన కింద అటవీ భూముల్లో నగర వనాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తోంది. రాష్ట్రంలో 15 నగర వనాల ఏర్పాటుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నగర వనాల్లోనే బయో డైవర్సిటీ కింద రకరకాల ప్రాజెక్టులను చేపడుతున్నారు. వీటిలో వాకింగ్ ట్రాక్ లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అమరావతిలోని నగర వనంలో జంతు ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చంద్రబాబు మదిలో వచ్చినట్లు తెలిసింది. ఇప్పుడు దీని సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిని గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు.